Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

ఫ్రొఫెషనల్ బైక్ రేసర్ అవతారంలో రాహుల్ గాంధీ

  • లడఖ్ పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ
  • బైక్ పై పాంగాంగ్ సరస్సుకు పయనం
  • రేపు (ఆగస్టు 20) రాజీవ్ గాంధీ జయంతి
  • పాంగాంగ్ సరస్సు వద్ద తండ్రి జయంతి జరుపుకోనున్న రాహుల్

కాంగ్రెస్ ఎంపీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బైక్ రేసర్ అవతారం ఎత్తారు. లడఖ్ పర్యటనలో ఉన్న ఆయన బైక్ పై భారత్-చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సుకు బయల్దేరారు. ఓ ప్రొఫెషనల్ బైకర్ ఎలాంటి దుస్తులు, ఉపకరణాలు ధరిస్తాడో, రాహుల్ అవన్నీ ధరించి బైక్ రైడింగ్ చేశారు. హిమాలయ పర్వత శ్రేణుల్లో రాహుల్ బైక్ విహారం అందరినీ విపరీతంగా ఆకర్షించింది. 

రేపు (ఆగస్టు 20) దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి. తన తండ్రి జయంతిని రాహుల్ గాంధీ పాంగాంగ్ సరస్సు వద్ద నిర్వహించనున్నారు. ఇక్కడి పర్యాటక శిబిరంలో రాహుల్ నేడు బస చేయనున్నారు. 

బైక్ రైడింగ్ కు ముందు రాహుల్ మీడియాతో మాట్లాడుతూ, పాంగాంగ్ సరస్సు రమణీయత గురించి తన తండ్రి చెబుతుండగా విన్నానని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ బైక్ రైడింగ్ చేయడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని తెలిపారు.

Related posts

రాజస్థాన్ ప్రభుత్వ బిల్డింగ్ బేస్ మెంట్ లో నోట్ల కట్టలు, బంగారు బిస్కెట్లు!

Drukpadam

డేంజర్ మార్కును దాటేసిన యమున.. ముప్పు ముంగిట్లో ఢిల్లీ

Ram Narayana

మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై ప్రియాంక అవినీతి ఆరోపణలు…చట్టపరమైన చర్యలకు సిద్ధం కావాలని బీజేపీ హెచ్చరిక …

Ram Narayana

Leave a Comment