Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు….

కరోనా వ్యాప్తి అరికట్టేందుకు స్వీయరక్షణే ఆయుధం
-అందుకు ప్రజలు లాక్ డౌన్ నిబంధనలు పాటించాలి
-ఖమ్మం పోలీస్ కమిషనర్ విషు యస్ వారియర్

కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతను నిరోధించి సురక్షితమైన సమాజం కోసం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందగా స్వీయ రక్షణలో వుండాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ సూచించారు.
ఈ సందర్భంగా ప్రజలకు పలు సూచనలు చేశారు.

-ప్రజాశ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని కరోనా ఉధృతిని కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ నిబంధనలను ప్రతిఓక్కరూ భాధ్యతగా తీసుకొని పాటించాలి.

-కొవిడ్ మహమ్మారి నియంత్రణకు ప్రజలు స్వీయ రక్షణకంటే మించింది మరోటి లేదు, ప్రతి ఒక్కరూ మాస్క్లు, బౌతికదూరం పాటిస్తూ..
శానిటైజర్లు తప్పనిసరిగా వాడాలి.

-ప్రభుత్వం మినహాయింపు కల్పించిన అత్యవసర సర్వీసులు, జారీ చేసిన పాసులు, వైద్య సేవల నిమిత్తం వెళ్లేవారిని మాత్రమే అనుమతిస్తున్నారు.

-ఇటువంటి విపత్కర సమయాలలో నిబంధనల ఉల్లంఘించటం అత్యంత బాధ్యాతరాహిత్యమనే విషయాన్ని ప్రతిఓక్కరూ గ్రహించాలని విజ్ఞప్తి.

-నిత్యావసర సరుకుల కొనుగోలుకు వెసులుబాటు కల్పించిన ఉదయం 6 నుండి 10 గంటల సమయంలో ప్రజలు తమ కార్యకలాపాలను పూర్తి చేసుకోని ఇంటికి చేరుకొవాలి.9:45 గంటలకు దుకాణాలు మూసివేయాలి.

  • కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశాలు ఉన్న ఫిష్ మార్కెట్లు, వెజిటేబుల్ మార్కెట్లలో నిత్యావసర సరకుల కోసం వస్తున్న ప్రజలు ఇంటికి వెళ్లేవరకు స్వీయ జాగ్రతలు పాటిస్తూ భౌతికదూరం, మాస్కులు తప్పనిసరిగా ధరించాలి.

-అత్యవసరం లేదా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే మాత్రమే బయటకు రావాలి. బయటకు వచ్చే సమయంలో తప్పకుండా మాస్కులు ధరించాలని, గుర్తింపు కార్ధు వెంట వుండాలి.

-నిబంధనలు అతిక్రమించి ఉదయం 10 గంటల తరువాత అనుమతిలేని వాహనాలు సంచరిస్తే వాటిని వెంటనే సీజ్ చేయడం జరుగుతుంది.

  • ఉదయం 10 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ ఉన్నందున ప్రజలెవరూ అనవసరంగా బయట తిరగవద్దు.

  • తోపుడు బండ్ల వ్యాపారులు రోడ్లపైన రాకుండా వారికి కేటాయించిన స్ధలంలోనే మాస్కులు ధరించి విక్రయాలు జరపాలి.

  • కరోనా వైరస్ ఉధృతంగా విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యాధి బారిన పడకుండా స్వీయ జాగ్రత్త పాటిస్తూ.. మీ కుటుంబాన్ని, సమాజాన్ని కరోనా నుండి కాపాడల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వుంటుందని గ్రహించాలి.

  • బహిరంగ ప్రదేశంలో షాపింగ్ మాల్లో, మార్కెట్ వద్ద గుంపులు గుంపులుగా ఉండవద్దు, ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలి.

  • కొవిడ్-19 నిబంధనలు పాటించని వారిపై, విపత్తు నిర్వహణా చట్టంలోని 51 నుంచి 60 సెక్షన్లు 188 ఐపీసి చట్టపరమైన చర్యలు.

 

ఎమ్మెల్యే సండ్రతో తో కలిసి బోర్డర్ చెక్ పోస్ట్ సందర్శించిన సి పి విష్ణు ఎస్ వారియర్

బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద కట్టుదిట్టమైన భద్రత…. మూడు షిఫ్ట్ డ్యూటీలతో 24×7 ముమ్మర తనిఖీలు…

  • మెడికల్ ఎమర్జెన్సీ, నిత్యావసర రవాణా సర్వీసులకు మాత్రమే అనుమతి..

  • రాష్ట్ర సరిహద్దు దాటి గ్రామాల మీదుగా జిల్లాలోకి రాకుండా గ్రామ వాలంటరీల కాపలా

  • పాస్ లేకుంటే ఎవరికి అనుమతి లేదు

  • ఆంధ్రా సరిహద్దులోని ముత్తగూడెం చెక్ పోస్టును సత్తుపల్లి MLA తో కలసి సందర్శించిన పోలీస్ కమిషనర్ *

  • తల్లాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అమలవుతున్న లాక్ డౌన్ పరిశీలించిన పోలీస్ కమిషనర్

పెనుబల్లి మండలం, ముత్తగూడెం గ్రామం నందు ఆంధ్ర సరిహద్దు ప్రాంతంలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టు
సత్తుపల్లి నియోజకవర్గ MLA శ్రీ సండ్ర వెంకట వీరయ్య తో కలసి పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ సందర్శించారు.

రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టుల్లో కఠినమైన ఆంక్షల అమలవుతున్నయని పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పెర్కొన్నారు.
సమాజ శ్రేయస్సు కోసం ప్రభుత్వం విధించిన
లాక్ డౌన్ ప్రజలందరూ సహకారిస్తున్నారని తెలిపారు.

రాష్ట్ర సరిహద్దు నుండి అంతర్గత దారుల వెంటా రాకుండా పోలీసు ,రెవెన్యూ,
అధికారులు గ్రామలను సందర్శించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.. గ్రామా వాలంటరీ పటిష్ట పరిచి పోలీస్ మార్గదర్శకాలు పాటిస్తూ సరిహద్దు గ్రామలలో కాపలా కాస్తున్నారు.

మూడు షిఫ్ట్ డ్యూటీలతో 24×7 నిరంతర తనిఖీలతో
బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలీస్ రెవెన్యూ ,హెల్త్ ,ఎక్సైజ్ శాఖల సమన్వయంతో పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్ర సరిహద్దు మెడికల్ ఎమర్జెన్సీ, నిత్యావసర రవాణా సర్వీసులకు,పాసులు వున్న వారికే మాత్రమే అనుమతిస్తున్నారని, ఎలాంటి అభ్యర్థనలు వచ్చినప్పటికీ పరిగణంలోకి తీసుకోకుండా పకడ్భందిగా నిబంధనలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.

తల్లాడ పోలీస్ స్టేషన్ పరిధిలో అమలవుతున్న లాక్ డౌన్ పరిశీలించిన పోలీస్ కమిషనర్ అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా బోర్డర్ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి, ఆశ వర్కర్లకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య గారి ఆధ్వర్యంలో మాస్కులు,
శానిటైజర్, వాటర్ బాటిల్స్ ను పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్ గారి చేతుల మీదుగా పంపిణీ చేశారు.

ఏసీపీ వెంకటేశ్, సిఐ కరుణకర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

 

 

 

ముదిగొండ పోలీస్ స్టేషన్ నుండి మోటార్ సైకిల్ ఎత్తుకెళ్లిన పాత నేరస్తులు అరెస్టు

 

 

చోరికి గురైన ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఏప్రియల్ 4 న ముదిగొండ మండలం గోకినేపల్లి వద్ద టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్ నాగరాజు కు అనుమానాస్పదంగా కనిపించిన ఎన్‌ఎక్స్ -200 పల్సర్ మోటార్‌సైకిల్‌ పై వెళ్తున్న ఇద్దరిని అపే ప్రయత్నం చేయగా మోటార్‌సైకిల్‌ను వదిలిపెట్టి పారిపోయారు.
మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్న ముదిగొండ పోలీసులు పోలీస్ స్టేషన్ వెనుక భాగంలోని గోడ వద్ద పార్కింగ్ చేసినట్లు ఖమ్మం రూరల్ ఏసీపీ వెంకటరెడ్డి తెలిపారు. కొన్ని రోజులు గడిచిన తరువాత పోలీస్ స్టేషన్ లో పార్కింగ్ చేసిన మోటారుసైకిల్ కనిపించడం లేదని గుర్తించిన పోలీసులు ఖమ్మం రూరల్ సిఐ ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు..

ఈ రోజు విశ్వసనీయ సమాచారం మేరకు సాయంత్రం 4:30 గంటల సమయంలో నేలకొండపల్లి మండలంలోని నాచెపల్లి గ్రామానికి చెందిన నేర చరిత్ర కలిగిన నిందుతులు సిమసతి నాగేశ్వరరావు 20సం,,రాలు, వెంకటేష్, 19 సం,,రాలు విచారించగా పోలీస్ స్టేషన్ నుండి చోరీ చేసినట్లు అంగీకరించారు.

మోటారుసైకిల్ ఎన్ఎక్స్ 200 పల్సర్ మోటార్ సైకిల్ బేరింగ్ నెం. టిఎస్ -07 హెచ్ఎల్ -5714 ను స్వాధీనం చేసుకున్నారు. ఇదే మోటార్ సైకిల్ ఈ ఏడాది మార్చి నెలలో హైయత్ నగర్ దొంగిలించినట్లు నిందుతులు అంగీకరించారని
ఏసిపీ తెలిపారు.

అదేవిధంగా గతంలో బోడు ఉప్పల్ , వనస్థాలిపురం పోలీస్ స్టేషన్లలో రెండు మోటార్ సైకిళ్ళ చోరీ కేసుల్లో నిందుతులుగా వున్నట్లు
ఏసీపీ తెలిపారు.

వృత్తిరిత్యా ట్రాక్టర్ డ్రైవర్లు కావడంతో ముదికొండ పోలీస్ స్టేషన్ లో పట్టుబడిన ఇసుక ట్రాక్టర్లను విధిగా సందర్శించేవారు. ఇదే అదునుగా భావించిన నిందుతులు ఇద్దరు పోలీస్ స్టేషన్ వెనుక వైపు గోడ నుండి మోటారుసైకిల్‌ను తీసుకెళ్లినట్లు నిందుతులు పోలీసుల విచారణలో వెల్లడించారని ఏసీపీ తెలిపారు.

 

 

అత్యవసరాలకు మాత్రమే ఇ-పాస్

 

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా విధించిన లాక్ డౌన్ నిబంధనలలో ప్రజల అత్యవసరాలను దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖ ఇ-పాస్ విధానాన్ని రూపొందించడం జరిగింది.
https://policeportal.tspolice.gov.in/ అను లింక్ ద్వారా అత్యవసరమున్న వారికి మాత్రమే ఇ-పాస్ ల ద్వారా మాత్రమే ప్రయాణాలు చేసేందుకు వీలు కల్పించడం జరిగింది.అత్యవసరంగా పాస్లు పొందాల్సిన వారు ఈ లింకు ద్వారా ఆన్లైన్ పోర్టల్ లో వివరాలన్నింటిని సరిగా పూరించి ఇ-పాస్ ను పొందగలరు.అనుమతించిన సమయమైన ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు కూడా అవసరమైతే తప్ప బయటకు రాకుండా ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణను పాటిస్తూ వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో తమ వంతు భాధ్యతను నిర్వర్తించాలి.లాక్ డౌన్ సడలింపు సమయం తర్వాత నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు,జరిమానాలు విధించడం జరుగుతుంది.జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు ఈ రోజు చేపట్టిన తనిఖీలలో మాస్కులు ధరించకుండా బయట తిరిగిన 61 మందిపై కేసులు నమోదు చేసి 61000/-ల రూపాయలను జరిమానాగా విధించడం జరిగింది.లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించి అనుమతించిన సమయం తర్వాత బయట తిరుగుతున్న 177 వాహనాలను,తెరిచి ఉన్న 07 దుకాణాలను సీజ్ చేయడం జరిగింది.డిసాస్టర్ మేనేజ్మెంట్ మరియు ఎపిడిమిక్ డీసీజస్ యాక్ట్-1897 ప్రకారం ఐపిసి సెక్షన్లతో 08 కేసులను నమోదు చేయడం జరిగింది.94 E-petty కేసులను కూడా నమోదు చేయడం జరిగింది.E-చలనా ద్వారా 866 మందికి జరిమానా విధించడం జరిగింది.ఇట్టి తనిఖీలలో సీజ్ చేసిన వాహనాలను లాక్ డౌన్ ముగిసేంత వరకు పోలీసు వారు తిరిగి ఇవ్వడం జరగదని తెలియజేస్తున్నాము.కావునా జిల్లా ప్రజలందరూ అనుమతించిన సమయంలో కూడా తప్పనిసరిగా మాస్కులను ధరిస్తూ, భౌతిక దూరాన్ని పాటిస్తూ పోలీసు వారికి సహకరించవలసినదిగా కోరుతున్నాము.

 

 

లాక్డౌన్ అమలు తీరును పరిశీలించిన పోలీస్ కమిషనర్

బుధవారం నగరంలోని వరంగల్ క్రాస్ రోడ్డు , శ్రీశ్రీ సర్కిల్ , ఇల్లందు క్రాస్ రోడ్డు , పాత బస్‌స్టాండ్,చర్చి కంపౌండ్ ప్రాంతాలలో లాక్‌డౌన్ అమలు
తీరును పరిశీలించారు.

లాక్‌డౌన్ సమయాల్లో అత్యవసర సర్వీసులు మినహా రహదారులపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ తెలిపారు.

సడలింపు సమయంలో రహదారిపై ఉన్న దుకాణ సముదాయాలను, రైతు బజార్‌, మార్కెట్‌ల వద్ద ఉన్న రద్దీని పోలీస్ కమిషనర్ పరిశీలించారు.

ఖమ్మంలో అడుగ‌డుగునా త‌నిఖీలు.. ఆంక్షలు అతిక్రమించిన వాహ‌నాలు సీజ్: పోలీస్ కమిషనర్

ఆంక్షలు అతిక్రమించి సరియైన కారణాలు లేకుండా ఈరోజు రోడ్లపై తిరుగుతున్న 230 వాహ‌నాలను ( 215 ద్విచక్ర వాహనాలు, 03 కార్లు, ఇతర వాహనాలు ) సీజ్ చేసినట్లు పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు.

క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి విధించిన లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ మరింత కఠినంగా అమలు చేసేందుకు
శనివారం జిల్లా వ్యాప్తంగా అడుగ‌డుగునా త‌నిఖీలు పోలీసులు ….చేపట్టారు.

జిల్లా వ్యాప్తంగా వున్న 15 సరిహద్దు చెక్ పోస్టులు, 15 అంతర్గత రహదారిపై వున్న చెక్ పోస్టులు, 37 పోలీస్ పికెటింగ్స్, 30 మొబైల్ పెట్రోకార్స్ ఉద‌యం 10 గంట‌ల త‌ర్వాత విస్తృతంగా వాహనాల త‌నిఖీలు చేపట్టారు. అన‌వ‌స‌రంగా రోడ్ల‌పైకి వ‌స్తున్న వాహ‌నాల‌ను సీజ్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. అత్యవసర సర్వీసులు, వైద్యానికి సంబంధించిన ప‌త్రాలు ఉన్న వారికి విధిగా అనుమ‌తి ఇస్తున్నారని పోలీస్ కమిషనర్ తెలిపారు.

నగరంలోని పలు ప్రాంతాలలో పర్యాటించిన పోలీస్ కమిషనర్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించేలా చర్యలు తీసుకొన్నారు.

కరోనా బారిన పడకుండా సిబ్బందికి  పోలీస్ శాఖ రక్షణకు చర్యలు

 

NRI   ఫౌండేషన్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి 150 ఫేస్ గార్డ్స్ ను పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ చేతుల మీదుగా పోలీస్ సిబ్బందికి అందజేశారు.

లాక్‌డౌన్‌కు సడలింపు సమయంలో జనసంచారన్ని దృష్టిలో పెట్టుకొని క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడకుండా అప్రమత్తమై మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు.

సిబ్బంది ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం కొవిడ్ టెస్ట్ చేయించడం, పాజిటివ్‌ వున్న వారికి మెరుగైన వైద్యం అదేలా చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ రమేష్ , సిఐ అంజలి, తుమ్మ గోపి, NRI ఫౌండేషన్ బండి నాగేశ్వరరావు , బాణాల రామకృష్ణ , రంగరావు తదితరులు పాల్గొన్నారు

 

భద్రాచలం లో లాక్ డౌన్ అమలు ….

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం వారు విధించిన లాక్డౌన్ అమలులో భాగంగా ఈ రోజు అనగా 26.05.20201 ఉదయం సుమారుగా 11.45 గంటల సమయంలో భద్రాచలం ఏ‌ఎస్‌పి గారు గోదావరి బ్రిడ్జి సమీపములో గల ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీలు చేయుచుండగా ఒక వ్యక్తి మోటార్ సైకిల్ పై వస్తుండగా తనిఖీలలో భాగంగా అతనిని ఆపగా,అతను తన పేరు ఘని, No.1 టి.వి.రిపోర్టర్,బూర్గంపాడు అని చెప్పి తన వద్ద ఉన్న అక్రిడిటేషన్ కార్డ్ మరియు పెళ్లి పర్మిషన్ చూపించి,తాను కారుమంచి మురళి కృష్ణ కూతురు “మదుహ” వివాహమునకు హాజరుకావటానికి అన్నపూర్ణ ఫంక్షన్ హాల్ భద్రాచలంనకు వెళ్తున్నాని చెప్పనాడు.అతను వెళ్ళుటకు అనుమతించినా గానీ వెళ్లకుండా,ఉద్దేశపూర్వకంగా బండిని పక్కకు పెట్టి నిల్చోని కాలయాపన చేస్తూ పోలీసు వారితో మాట్లాడుతూ వారి దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తూ,పెళ్ళికి పర్మిషన్ లేకుండా వెళ్ళేవారికి సహకరించటానికి ప్రయత్నం చేసి,అదే సమయంలో సారపాక నుండి భద్రాచలం వైపు ద్విచక్ర వాహనం [AP-20AQ-8751 Honda Activa] పై వస్తున్న వారిని వెళ్ళమని సైగ చేయగా వారు వాహనం ఆపకుండా వెళ్ళిపోయినారు.ఇట్టి విషయంలో వాహనం ఆపకుండా వెళ్ళినవారి వివరములు తెలుసుకోగా, సారపాకకు చెందిన మద్దిపోటి రామకృష్ణ మరియు మద్దిపోటీ రాణి అని తెలిసినది.వారి ఇరువురికి పెళ్లి వెళ్ళడానికి పర్మిషన్ లేదని చెప్పినాడు. ఇతను మద్దిపోటి రామకృష్ణ మరియు మద్దిపోటీ రాణిల ద్విచక్ర వాహనము [AP-20AQ-8751 Honda Activa] ను పోలీసు లు ఆపుతున్న ఆపకుండా వెళ్ళటానికి సహకరించినాడు. ఇతను పత్రికా విలేఖరులకు ఇచ్చిన అక్రిడిటేషన్ కార్డ్,పెళ్లి కొరకు ఇచ్చిన అనుమతిని దుర్వినియోగపరిచి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం వారు విధించిన లాక్ డౌన్ అమలు కొరకు శాసనరీత్యా ప్రకటించబడిన ఉత్తర్వులను పాటించకుండా ఆటంకము కలిగించి,లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసుల విధులను ఆటంకపరిచి నందులకు తగు విచారణ అనంతరం సదరు ఘని,రామకృష్ణ మరియు మద్దిపోటీ రాణిలపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగింది.

 

జూన్ 3వ తేదీన హేమచంద్రాపురం పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు గల పరేడ్ గ్రౌండ్ నందు పాత వస్తువుల వేలం పాట : ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖకు సంభందించి నిరుపయోగంగా ఉన్న పాత వస్తువులను విక్రయించేందుకు 03.06.2021 న వేలంపాట నిర్వహించనున్నామని ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ఈ రోజు ఒక ప్రకటనలో తెలియజేసారు.ఆసక్తి గల కొనుగోలుదారులు తమ ఆధార్ కార్డుతో జూన్ 3వ తేదీన ఉదయం 10గంటల నుండి ప్రారంభం కానున్న వేలంపాట కార్యక్రమానికి హాజరుకావాలని కోరారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుశాఖలోని నిరుపయోగంగా ఉన్న ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్ వ్యర్ధాలు,కంప్యూటర్ పరికరాలు,ఫర్నిచర్,పాత ఇనుము,రైన్ కోట్స్,షామియానాలు,టెంట్లు,వెబ్ ఆర్టికల్స్,పాత బ్యాటరీలు,హాండ్ కప్స్,పాలీ కార్బోనేట్ స్టోన్ గార్డ్స్,డ్రాగన్ లైట్స్,హెల్మెట్స్,బాడీ ప్రొటెక్టర్స్ మొదలగు ఇతర స్టోర్స్ వస్తువులను విక్రయించేందుకు ఈ వేలంపాట నిర్వహించనున్నామని తెలిపారు.
ఆసక్తి గల కొనుగోలుదారులు ఈ క్రింది నంబర్లకు సంప్రదించగలరు:

సి.హెచ్.ఎస్.వి.కృష్ణ (రిజర్వ్ ఇన్స్పెక్టర్)-9491088575
సూర్యనారాయణ (ఏఆర్ఎస్ఐ) -7901143227
కిషన్ (హెడ్ కానిస్టేబుల్)-౯౪౪౦౫౫౪౧౬౯

 

Related posts

ఇజ్రాయెల్ లో కొత్త వైరస్ కలకలం.. తొలి ‘ఫ్లోరోనా’ కేసు నమోదు!

Drukpadam

కరోనా డేంజర్ బెల్స్ ఇంకా ఉన్నాయి … జాగ్రత్తలు అవసరం మాస్క్ తప్పనిసరి!

Drukpadam

కెనడా వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ ….విమానాలపై నిషేధం తొలగింపు !

Drukpadam

Leave a Comment