Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తుమ్మలను బీజేపీలోకి ఆహ్వానిస్తాం: ఈటల రాజేందర్

  • తుమ్మల నాగేశ్వరరావును అవసరానికి వాడుకుని వదిలేశారన్న ఈటల
  • బీజేపీలో చేరికపై ఆయన్ను కలిసి చర్చిస్తామని వెల్లడి
  • రాష్ట్రంలో తాము అధికారంలోకి రావడం తథ్యమని ధీమా

బీఆర్ఎస్ నుంచి పాలేరు టికెట్ రాకపోవడంతో తుమ్మల నాగేశ్వరరావు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించిన ఆయన.. ఏ పార్టీలో చేరుతారనేది ఇంకా స్పష్టం చేయలేదు. కాంగ్రెస్‌లో చేరాలని అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎన్నికల చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 

తుమ్మల నాగేశ్వరరావును బీజేపీలోకి ఆహ్వానిస్తామని ఈటల చెప్పారు. ఈ విషయంలో ఆయన్ను కలిసి చర్చిస్తామని వెల్లడించారు. తుమ్మలను బీఆర్ఎస్‌లో అవసరానికి వాడుకుని వదిలేశారని ఆరోపించారు. ఆయన్ను తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పుకొచ్చారు. 

తెలంగాణలో రైతాంగం కష్టాల్లో ఉందని ఈటల అన్నారు. రాష్ట్ర రైతులకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు. ఈ రోజు ఖమ్మంలో జరగబోయే బహిరంగ సభలో రైతు డిక్లరేషన్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటిస్తారని వెల్లడించారు. ఈ సభ ద్వారా బీజేపీ వైఖరిని స్పష్టం చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.

Related posts

రేవంత్ ప్రమాణస్వీకారం.. జగన్, చంద్రబాబు, కేసీఆర్ లకు ఆహ్వానాలు!

Ram Narayana

ముస్లిం సమాజానికి… హిందూ యువతకు బండి సంజయ్ విజ్ఞప్తి

Ram Narayana

కాంగ్రెస్ నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్

Ram Narayana

Leave a Comment