- ఢిల్లీలో ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల
- ఎన్టీఆర్ అంటే తెలియని వాళ్లు ఉండరన్న పురందేశ్వరి
- మహిళల సంక్షేమానికి ఆయన ఎంతో పాటుపడ్డారని వ్యాఖ్య
ఎన్టీఆర్ ఒక తరం హీరో మాత్రమే కాదని, అన్ని తరాలకు ఆదర్శ హీరో అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఈ రోజు ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ స్మారక నాణేన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి పురందేశ్వరి, వెంకటేశ్వరరావు దంపతులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ.. స్మారక నాణెం విడుదల చేయడం ఎన్టీఆర్‌కు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఎన్టీఆర్ అంటే తెలియని వాళ్లు ఉండరని అన్నారు. “మహిళల సంక్షేమానికి ఎన్టీఆర్ ఎంతో పాటుపడ్డారు. మహిళల ఆస్తిలో హక్కు ఉండాలని ఆయన చెప్పారు. తిరుపతిలో మహిళా యూనివర్సిటీ ఏర్పాటు చేశారు” అని గుర్తు చేశారు.