Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

చంద్రయాన్​–3లో కీలక ఘట్టం.. చంద్రుడిపై ప్రాణవాయువు జాడ గుర్తింపు

  •  మనిషి నివాసానికి అవసరమైన కీలక
    మూలకాలను గుర్తించిన ప్రజ్ఞాన్ రోవర్
  • సల్ఫర్‌తోపాటు ఆక్సిజన్‌ ఉనికి గుర్తింపు  
  • ఈ రోజు రాత్రి సూపర్ బ్లూ మూన్

చంద్రుడిపై మానవుడు జీవించే కాలంలో రాబోతోంది. ప్రాణికోటికి జీవనాధారమైన ఆక్సిజన్‌ను చంద్రుడి దక్షిణ ధ్రువంపై గుర్తించింది. చంద్రయాన్‌-3 మిషన్‌లో భాగంగా జాబిల్లి ఉపరితలంపైన అడుగు పెట్టిన ప్రజ్ఞాన్‌ రోవర్‌ తన పరిశోధనలు మొదలు పెట్టింది. చంద్రుడిపై సల్ఫర్‌తోపాటు ఆక్సిజన్‌ ఉనికిని గుర్తించింది. దక్షిణ ధ్రువానికి సమీపంలోని చంద్రుడి ఉపరితలంపై సల్ఫర్‌ (ఎస్‌) ఉనికిని స్పష్టంగా గుర్తించినట్టు ఇస్రో వెల్లడించింది. అల్యూమినియం, కాల్షియం, ఫెర్రస్‌, క్రోమియం, టైటానియం, మాంగనీస్‌, సిలికాన్‌ ఉనికిని గుర్తించిందని, హైడ్రోజన్‌ (హెచ్‌)కోసం అన్వేషణ కొనసాగుతోందని ఇస్రో తెలిపింది. 

దాంతో, చంద్రుడిపై మనిషి నివసించటానికి అవసరమైన అన్ని మూలకాలు, పరిస్థితులను ఇస్రో గుర్తించినట్టయింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై అరుదైన సల్ఫర్‌ జాడ కనిపించడం చాలా కీలకం అవనుంది. సల్ఫర్‌ మంచు నీటి ఉనికికి సంకేతం కావొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. మరోవైపు ఈ రోజు ఆకాశంలో అద్భుతం జరగనుంది. ఈ రాత్రి చందమామ భూమికి మరింత దగ్గరగా రానుంది. సాధారణ పౌర్ణమి కంటే మరింత పెద్దదిగా, ప్రకాశవంతంగా కనిపించనుంది. దీన్ని సూపర్‌ బ్లూ మూన్‌ అంటారు.

విక్రమ్ ల్యాండర్‌ను క్లిక్‌మనిపించిన ప్రజ్ఞాన్ రోవర్

  • ఫోటోలను షేర్ చేసిన భారత అంతరిక్ష సంస్థ ఇస్రో
  • ఫోటోలు షేర్ చేస్తూ సరదాగా స్మైల్ ప్లీజ్ అని రాసుకొచ్చిన ఇస్రో
  • నాన్‌కామ్ ఈ ఫోటోలు తీసినట్లు వెల్లడించిన ఇస్రో
Pragyan Rover clicked an image of Vikram Lander this morning

ప్రజ్ఞాన్ రోవర్ బుధవారం ఉదయం విక్రమ్ ల్యాండర్ చిత్రాన్ని క్లిక్ ‌మనిపించింది. చంద్రయాన్-3 ప్రయోగం తర్వాత విక్రమ్ ల్యాండర్, రోవర్‌కు సంబంధించిన చిత్రాలను ఇస్రో ఎప్పటికప్పుడు సామాజిక అనుసంధాన వేదిక ద్వారా పోస్ట్ చేస్తోంది. తాజాగా ల్యాండర్ ఫోటోలను రోవర్ తీసింది. ఇస్రో ఆ ఫోటోలను షేర్ చేస్తూ సరదాగా స్మైల్ ప్లీజ్ అని రాసుకొచ్చింది. ఈ మిషన్ యొక్క చిత్రాన్ని రోవర్ తన నావిగేషన్ కెమెరా ద్వారా (నావ్‌కామ్) తీసిందని తెలిపింది. చంద్రయాన్-3 కోసం నావ్‌కామ్‌ను ల్యాబోరేటరీ ఫర్ ఎలక్ట్రో-ఆప్టిక్స్ సిస్టమ్(ఎల్ఈఓఎస్) అభివృద్ధి చేసింది.

Related posts

భారత్ కొన్ని లక్షల మందిని కష్టాలపాలు చేస్తోంది..కెనడా ప్రధాని ఆరోపణ

Ram Narayana

టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల… ఒకే గ్రూపులో భారత్, పాకిస్థాన్

Ram Narayana

మయన్మార్ సరిహద్దులో కంచె నిర్మాణం.. కేంద్రం కీలక నిర్ణయం

Ram Narayana

Leave a Comment