Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

రేవ్ పార్టీ పై పోలిసుల రైడ్ ….పోలీసులపైకి చిక్కిన సినీప్రముఖులు …

మాదాపూర్‌లో రేవ్ పార్టీపై రెయిడ్.. పోలీసుల అదుపులో సినీ ప్రముఖులు

  • రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో మాదాపూర్‌లో నార్కోటిక్స్ బ్యూరో రెయిడ్
  • పోలీసులకు చిక్కిన పలువురు నిందితులు
  • పడ్డుబడ్డ వారిలో ఓ నిర్మాత, ఇండస్ట్రీకి చెందిన యువతులు ఉన్నట్టు సమాచారం
  • నిందితుల వద్ద భారీ స్థాయిలో లభించిన డ్రగ్స్

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో పోలీసులు ఓ రేవ్ పార్టీని భగ్నం చేశారు. ఈ పార్టీపై పక్కా సమాచారంతో యాంటీ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులకు చిక్కిన నిందితుల వద్ద భారీగా మాదక ద్రవ్యాలు లభించాయి. నిందితుల్లో ఓ సినీ నిర్మాత, ఇండస్ట్రీకి చెందిన పలువురు యువతులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.

రేవ్ పార్టీలు , డ్రగ్స్ సేవించడం నిత్యకృత్యంగా మారింది …ఇది ఒక జాడ్యంలో సమాజంలో ఉంది.ప్రధానంగా సినీప్రముఖులు , కాలేజీ యువతి ,యువకులు డ్రగ్స్ కు అలవాటుపడి చెడుమార్గాలు పడుతున్నారు. మంచి భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు . పేద మధ్యతరగతి వాళ్ళు కాకుండా ఉన్నత తరగతి కుటుంబాలు , సినీ పరిశ్రమలో పనిచేసే అనేక మంది పై చాలాసార్లు డ్రగ్స్ వాడకంపై అభియోగాలు వచ్చాయి. అయినప్పటికీ మార్పు లేదు ..చిన్న చిన్న వాళ్లపై కేసులు పెట్టి వాళ్ళను ఇబ్బందులు పెట్టె పోలీస్ శాఖ పెద్దల విషయంలో అంటీముట్టనట్లుగా ఉంటుందనే అభియోగాలు ఉన్నాయి. గతంలోకూడా అనేక మంది సినీప్రముఖులు డ్రగ్స్ వాడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై దర్యాప్తు జరిపినప్పటికీ వారికీ ఎలాంటి శిక్షలు పడలేదు ..దానికి కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ..విశ్వనగరంగా చెప్పబడుతున్న హైద్రాబాద్ లో డ్రగ్స్ వాడకంపై ఉక్కుపాదం మోపకపోతే అనేక కుటుంబాలు ఇబ్బందులపాలు కావడం ఖాయం…

Related posts

ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం.. అభ్యర్థుల వ్యయ పరిమితి పెంపు!

Drukpadam

వృద్ధులకు రాయితీ ఎత్తేయడంతో రైల్వేకు కళ్లు చెదిరే ఆదాయం!

Drukpadam

మిడతల గురించి చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చెప్పిన కేసీఆర్!

Drukpadam

Leave a Comment