Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకు ఇవ్వాలంటూ ప్రగతిభవన్ కు సర్పంచ్ నవ్య

స్టేషన్ ఘనపూర్ టికెట్ తనకు ఇవ్వాలంటూ ప్రగతిభవన్ కు సర్పంచ్ నవ్య
ఇప్పటికే ప్రకటించిన టికెట్స్ మార్చబోమంటున్న సీఎం కేసీఆర్
ప్రచారంలోకి దిగిన అభ్యర్థులు …స్టేషన్ ఘనపూర్ రాజకీయాల్లో కొత్త చర్చ
సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యకు టికెట్ నిరాకరించిన సీఎం కేసీఆర్
మాజీ మంత్రి కడియం శ్రీహారికి టికెట్ ప్రకటించిన బీఆర్ఎస్ బాస్
ఈసారి తనకు అవకాశం ఇవ్వాలంటున్న జానకిపురం సర్పంచ్ నవ్య

స్టేషన్ ఘనపూర్‌ రాజకీయాలు మరోసారి వార్తల్లోకి వెక్కాయి . సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్థానికంగా వివాదాల్లో ఇరుక్కోవడంతో ఆయన్ను కాదని సీఎం కేసీఆర్ మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టికెట్ ప్రకటించారు. అయినా తాను పార్టీ మారనన్న రాజయ్య టికెట్ కోసం ప్రయత్నిస్తానని చెప్పారు. ఆయనకు మద్దతుగా మంద కృష్ణ మాదిగ తదితరులు సంఘీభావం ప్రకటించారు. మరోవైపు జానకిపురం సర్పంచ్ నవ్య తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ను కోరుతున్నారు.

ఏడు దశాబ్దాల చరిత్రలో స్టేషన్ ఘనపూర్ నుంచి ఒక్కసారి కూడా మహిళకు అవకాశం రాలేదని, ఈ సారి తనకు అవకాశం ఇవ్వాలని నవ్య అంటున్నారు. ఈ రోజు హైదరాబాద్‌ వచ్చి పలువురు బీఆర్ఎస్ పార్టీ ప్రముఖులను నవ్య దంపతులు కలవనున్నారు. టికెట్ కోసం విజ్ఞప్తి చేస్తారని తెలుస్తోంది. గతంలో ఎమ్యెల్యే రాజయ్యపై అనేక ఆరోపణలు చేసిన నవ్య రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఇప్పుడు టికెట్ రేసులోకి వచ్చి కడియం శ్రీహరి, రాజయ్యతో పోటీపడటం స్టేషన్ ఘనపూర్ రాజకీయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

నిరంతరం వార్తల్లో ఉన్న నవ్య నియోజకవర్గంలో ప్రత్యేకంగా పరిచయంలేని వ్యక్తిగా ఉన్నారు . తనను ఎమ్మెల్యే రాజయ్య వేధించారని మీడియా ముందుకు వచ్చారు .తరవాత వారి మధ్య రాజీకుదిరింది ..కొద్దీ రోజుల తర్వాత రాజయ్య పై మళ్ళీ విమర్శలు గుప్పించారు . టికెట్స్ ప్రకటించిన తర్వాత తనకు టికెట్ కావాలని కోరడం వెనక ఎవరైనా ఉన్నారా అనేది చర్చనీయాంశంగా మారింది…మాజీమంత్రి సీనియర్ నేత కడియం శ్రీహరిని ప్రకటించిన తర్వాత ఇలాంటి ప్రకటనలు వార్తలు పార్టీని ఇబ్బందులకు గురిచేసేవిగానే ఉంటాయి..

Related posts

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ బతకనీయదు… కేసీఆర్

Ram Narayana

బర్రెలక్క శిరీష ధైర్యంగా ముందుకు సాగుతోంది… మనందరికీ ఆదర్శం: మాజీ జేడీ లక్ష్మీనారాయణ

Ram Narayana

బ్రేకులు ఫెయిల్ కావడంతో ఫ్లాట్ ఫాంపైకి దూసుకొచ్చిన బస్సు.. విజయవాడలో ముగ్గురి మృతి

Ram Narayana

Leave a Comment