Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

మా కూటమి పేరు ‘భారత్’ అని పెట్టుకుంటే దేశం పేరును బీజేపీగా మారుస్తారా?: కేజ్రీవాల్

  • మా కూటమి పేరును I.N.D.I.A.గా పెట్టుకున్నందుకే పేరు మారుస్తారా? అని ప్రశ్నించిన కేజ్రీవాల్ 
  • ఈ దేశం 140 కోట్ల మందిదని, ఒక పార్టీది కాదని వ్యాఖ్య  
  • పేరు మార్పుపై తనకు అధికారిక సమాచారం లేదని స్పష్టీకరణ

జీ20 విందుకు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ పంపిన ఆహ్వాన‌ప‌త్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ భార‌త్ అని పేర్కొన‌డంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ… పేరు మార్పుపై తనకైతే అధికారిక సమాచారం లేదని చెబుతూనే, బీజేపీని గద్దెదించేందుకు విపక్షాలు కూటమిగా ఏర్పడి I.N.D.I.A. అని పేరు పెట్టుకున్నాయని గుర్తు చేశారు. తాము అలా పేరు పెట్టుకున్నందుకే కేంద్రం I.N.D.I.A. పేరును తొలగించి భారత్ అని మారుస్తుందా? అని ప్రశ్నించారు. ఈ దేశం 140 కోట్ల మందిదని, ఏదో ఒక పార్టీది కాదన్నారు. ఒకవేళ ప్రతిపక్ష కూటమి I.N.D.I.A. అని కాకుండా భారత్ అని పేరు పెట్టుకుంటే అప్పుడు దేశం పేరును బీజేపీగా మారుస్తారా? అని చురక అంటించారు.

అలాగే, ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశం ఒక రాజకీయ పార్టీకి చెందినది కాదన్నారు. జీ20 సమ్మిట్ విందు ఆహ్వాన పత్రికలపై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం అందరిలోను అనుమానాలకు తావిచ్చిందని, పేరు మార్పుపై ఇది చర్చకు దారి తీసిందని పేర్కొన్నారు. ఇష్టానుసారంగా మార్చడానికి ఈ దేశం బీజేపీ సొత్తు కాదన్నారు. జుడేగా భారత్.. జీతేగా ఇండియా అంటూ చద్దా పేర్కొన్నారు.

 ఇది కేవలం ఆరంభమే: పేరు మార్పుపై బీజేపీ నేత సీపీ జోషి

BJPs CP Joshi On India Name Change Buzz

ఇండియా పేరును భారత్‌గా మార్చడం ఆరంభమేనని బీజేపీ నేత సీపీ జోషి అన్నారు. పేరు మార్పుపై దేశవ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో ఆయన మంగళవారం ఎన్డీటీవీతో మాట్లాడుతూ…  ‘ఇది కేవలం ఆరంభమే’ అని వ్యాఖ్యానించారు. ఎన్డీటీవీ రాజస్థాన్ ఛానల్ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు.

ఇండియా పేరును భారత్‌గా మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పేరు మార్పును కాంగ్రెస్ సహా విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. జీ20 విందుకు రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్ పంపిన ఆహ్వాన‌ప‌త్రంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులు ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని పేర్కొనడం ఈ ప్రచారానికి కారణమైంది. పేరు మార్పును చాలామంది స్వాగతిస్తుండగా, కొంతమంది విభేదిస్తున్నారు.

పేరు మార్పు వల్ల సమస్యలు పక్కదారి పట్టకుండా చూడాలి …జెడి లక్ష్మీనారాయణ

JD Laxminarayana responds on India to Bharat name change

ఇండియా పేరును భారత్‌గా మారుస్తారనే ప్రచారం నేపథ్యంలో ఈ అంశంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ స్పందించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ… రాజ్యాంగంలో ఇండియాతో పాటు భారత్ అనే పేరు కూడా ఉందని గుర్తు చేశారు. ఇండియా అనే పేరు బ్రిటిష్ వాళ్లు ఇచ్చిన పేరు అన్నారు. విదేశీయులు తెచ్చిన పేరును తీసేసి, మనం మన పేరు పెట్టుకుందామనే ఆలోచన కావొచ్చునన్నారు. ఇండియా పేరును భారత్‌గా మార్చడం తప్పేమీ కాదన్నారు. ఇండియా నుండి భారత్‌గా పేరు మార్చాలంటే రాజ్యాంగ సవరణ కూడా చేయాలని స్పష్టం చేశారు. అయినా ఈ పేరు మార్పు వల్ల అసలు సమస్యలు పక్కదారి పట్టకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

మనం కూడా ఇప్పటి వరకు చాలా పట్టణాల పేర్లు మార్చామని, మద్రాస్‌ను చెన్నైగా, బొంబాయిని ముంబైగా, కలకత్తాను కోల్‌కతాగా ఇలా పలు నగరాల పేర్లు మార్చినట్లు తెలిపారు. అలాగే మన దేశం పేరు కూడా మారుస్తున్నారేమో అన్నారు. ఇండియా స్థానంలో భారత్ పేరు మార్చితే అప్పుడు ఆర్బీఐ, ఎయిమ్స్, ఐఐటీ, ఐపీఎస్, ఐఏఎస్ పేర్లు కూడా మార్చవలసి ఉంటుందన్నారు. వీటిలో ఇండియా అనే పేరు ఉందని గుర్తు చేశారు. అయినా పేరు మార్పుపై చర్చలు జరుగుతున్నాయని, పేరు ఏది మారినా దేశంలోని సమస్యలను దూరం చేయడం అసలు లక్ష్యం కావాలన్నారు.

Related posts

కేటీఆర్‌కు కర్ణాటక సీఎం సిద్దరామయ్య కౌంటర్‌

Ram Narayana

మోదీ పాలనలో రైలు ప్రయాణం నరకంగా మారింది: రాహుల్ గాంధీ

Ram Narayana

సరైన సమయం వచ్చింది.. నా రీఎంట్రీ మొదలైంది: శశికళ సంచలన ప్రకటన….

Ram Narayana

Leave a Comment