Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

రేపో ఎల్లుండో నన్ను అరెస్ట్ చేసినా చేస్తారు: చంద్రబాబు

  • నిప్పులా బతికిన తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు మండిపాటు
  • తనపై కూడా దాడి చేస్తారని వ్యాఖ్య
  • రామాయణ, మహాభారతాల్లో ధర్మం గెలిచినట్టు మనమే గెలుస్తామన్న బాబు

నిప్పులా బతికిన తనపైనే తప్పుడు కేసులు పెడుతున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్ అరాచక పాలన అంతం కోసం ఇంటికొకరు తనతో పాటు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో తనను అరెస్ట్ చేసినా చేస్తారు అని  చెప్పారు. తనపై కూడా దాడి చేస్తారని అన్నారు. ఎన్ని చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పారు. మహాభారతం, రామాయణంలో ధర్మం గెలిచినట్టు చివరకు మనమే గెలుస్తామని అన్నారు. గతంలో ఎప్పుడూ రాని మెజార్టీ ఈ ఎన్నికల్లో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో పల్లె ప్రగతి కోసం ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

Related posts

వైఎస్సార్ బిడ్డనైన నేను వైఎస్ షర్మిలారెడ్డి కాకుండా పోతానా?: వైసీపీ శ్రేణులపై షర్మిల ఫైర్

Ram Narayana

ప్రశాంత్ కిషోర్ పై వైపీసీ సంచలన వ్యాఖ్యలు …

Ram Narayana

పార్టీ ఆదేశిస్తే కడప నుంచి పోటీ చేస్తా: షర్మిల

Ram Narayana

Leave a Comment