Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ప్లాష్ ..ప్లాష్ … రేపే సోనియా సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న తుమ్మల…..

ప్లాష్ ..ప్లాష్ … రేపే సోనియా సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్న తుమ్మల…..
ఆయన పోటీకి కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ …
రాష్ట్ర రాజకీయాలపై తుమ్మల చేరిక ప్రభావం
ఖమ్మం జిల్లాలో 10 కి 10 సీట్లు గెలుస్తామంటున్న కాంగ్రెస్ నేతలు ..
శక్రవారం సాయంత్రం తుమ్మల నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించినా ఠాక్రే , రేవంత్ , భట్టి , పొంగులేటి ….
కాంగ్రెస్ ఆహ్వానాన్ని అంగీకరించిన తుమ్మల

ఖమ్మం జిల్లా రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి…నిన్నమొన్నటివరకు సస్పెన్షన్ గా ఉన్న మాజీమంత్రి రాజకీయ దురంధరుడు తుమ్మల చేరిక వ్యవరానికి పోలిస్టాప్ పడింది…ఆయన శనివారం సాయంత్రం కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు అంగీకరించారు… కాంగ్రెస్ నేతలు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యరావు ఠాక్రే , పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క , మాజీ ఎంపీ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో- చైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శక్రవారం సాయంత్రం హైద్రాబాద్ లోని తుమ్మల నివాసానికి వెళ్లి కాంగ్రెస్ లోకి రావాల్సిందిగా చేసిన విజ్ణప్తికి తుమ్మల సానుకూలంగా స్పందించారు . ఖమ్మం జిల్లాలో ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు పాలేరు నుంచి పోటీచేసేందుకు కాంగ్రెస్ అంగీకరించినట్లు సమాచారం…అయితే తుమ్మల మాత్రం ఎలాంటి షరతులు లేకుండానే పార్టీలో చేరుతున్నట్లు చెపుతున్న పాలేరు లేదా ఖమ్మంలో పోటీ చేయించాలని ఆలోచనతో కాంగ్రెస్ ఉందని ప్రచారం జరిగింది..తుమ్మల చేరికతో ఖమ్మం జిల్లాలో తమకు 10 సీట్లు వస్తాయని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు . రేపు హైద్రాబాద్ తాజ్ కృష్ణ హోటల్ లో జరిగే సీడబ్ల్యూ సి సమావేశాలకు వస్తున్నా కాంగ్రెస్ అగ్రనేతల సమక్షంలో తుమ్మల చేరిక ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి..ఏదైనా కారణాలవల్ల రేపు చేరిక వాయిదా పెడితే ఆదివారం ఉదయం కచ్చితంగా ఉంటుందని సమాచారం …రాష్ట్ర వ్యాపితమగా తుమ్మల చేరికపై ఉత్కటంత ఏర్పడిన నేపథ్యంలో దానికి తెరపడనుంది . తుమ్మలతో పాటు మరికొందరు ముఖ్యనేతలు కాంగ్రెస్ లో చేరతారని విశ్వసనీయ సమాచారం …రేపు ఉదయం ప్రత్యేక ఫ్లైట్ లో సోనియా , రాహుల్ హైద్రాబాద్ చేరుకుంటారు ..తెలంగాణాలో త్వరలో జరుగనున్న నేపథ్యంలో హైద్రాబాద్ లో జరుగుతున్న సీడబ్ల్యూ సి సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది…

Related posts

తెలంగాణాలో కాంగ్రెస్ 80 సీట్లతో అధికారంలోకి వస్తుంది…రేవంత్ రెడ్డి

Ram Narayana

అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది: రేవంత్ రెడ్డి

Ram Narayana

ఈసారి రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేను: ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

Ram Narayana

Leave a Comment