Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఈసారి రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేను: ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు

  • గత ఉప ఎన్నికల్లో కేసీఆర్ తనను చాపను రాకినట్లు రాకాడన్న ఈటల రాజేందర్
  • ఇప్పుడు కొన ఊపిరితో కొట్లాడుతున్నానని… అందుకే రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితిలోలేనని వ్యాఖ్య
  • నా ధైర్యం, శక్తి అంతా హుజూరాబాద్ ప్రజలేనన్న ఈటల రాజేందర్

బీజేపీ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఈసారి రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితిలో లేనని వ్యాఖ్యానించారు. ఆయన ఈ రోజు హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… గత ఉప ఎన్నికల్లో కేసీఆర్ తనను చాపను రాకినట్లు రాకాడని (ఇబ్బంది పెట్టడం), అయినా ఇప్పుడు కొన ఊపిరితో కొట్లాడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను ఇప్పుడు రూపాయి కూడా ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేనన్నారు. తన వెంట ఉన్నది ధైర్యలక్ష్మి మాత్రమే అన్నారు.

డబ్బులు ఉంటేనే రాజకీయం చేయడం కాదని, డబ్బులు లేకపోయినా నేను రాజకీయం చేస్తున్నానన్నారు. ఇతర పార్టీలు, ఆ పార్టీల అభ్యర్థులు ఓటుకు రూ.2 వేలు, రూ.3 వేలు ఇస్తే తీసుకోవాలని, కానీ బీజేపీ కమలం గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నా శక్తి, ధైర్యం అంతా హుజూరాబాద్ ప్రజలే అన్నారు. కానీ ప్రస్తుతం డబ్బులు ఖర్చు పెట్టే పరిస్థితుల్లో తాను లేనన్నారు.

Related posts

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మార్చుతాం: యూపీ సీఎం యోగి

Ram Narayana

ఓటే వజ్రాయుధం …ఆలోచించి ఓటు వేయాలి …ఖమ్మం ,కొత్తగూడెం సభలో కేసీఆర్

Ram Narayana

సత్తుపల్లిలో వెంకటవీరయ్య 80 వేల మెజార్టీతో గెలవడం ఖాయం… సీఎం కేసీఆర్…!

Ram Narayana

Leave a Comment