Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

రాజస్థాన్ లో బీజేపీ ఎంపీ రంజిత కారుపై దాడి…

రాజస్థాన్ లో బీజేపీ ఎంపీ రంజిత కారుపై దాడి…
-రాళ్లు, ఇనుప రాడ్లతో దాడి చేసిన దుండగులు
-రాజస్థాన్‌లోని భరత్‌పూర్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తోన్న రంజిత
-ఆసుప‌త్రి నుంచి ఇంటికి వెళ్తుండ‌గా ఘ‌ట‌న‌
-దాడి చేసిన వారిని వదిలిపెట్టనన్న రంజిత‌
-రాత్రిపూట కావడంతో దుండగులను గుర్తించలేదు
-దర్యాప్తు చేస్తున్న పోలీసులు

రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌ లోక్‌సభ ఎంపీ రంజిత కోలి వెళ్తున్న కారుపై భీక‌ర దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఇందుకు సంబంధించిన వీడియోను రంజిత ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. క‌రోనా బాధితుల‌ను ప‌రామ‌ర్శించి, ధైర్యం చెప్పేందుకు ఆమె ప‌లు ఆసుప‌త్రుల‌ను సంద‌ర్శించారు. తిరుగు ప్రయాణంలో ఇటీవ‌ల‌ రాత్రి 11.30 గంటల సమయంలో ధర్సోని గ్రామం మీదుగా భరత్‌పూర్‌ వెళ్తుండ‌గా, గుర్తు తెలియ‌ని వ్యక్తులు రాళ్లు, ఇనుప రాడ్లతో దాడికి దిగారు. ఆకస్మాత్ గా జరిగిన ఈ సంఘటనతో ఎంపీ తోపాటు ఆమె వెంట ఉన్న ఉన్న అనుచరులు సైతం షాక్ అయ్యారు . కొంతమందికి రాళ్ల గాయాలైయ్యాయి. ఎంపీ తో సహా గాయాలు అయినా వారిని పోలీసులు సమీపంలోని ప్రాధమిక ఆరోగ్యకేంద్రానికి తరలించి చికిత్స అందించారు. దెబ్బతిన్నాయి .

కారు అద్దాలు ధ్వంస‌మ‌య్యాయి. ఎంపీ అనుచ‌రుల‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందేలా చేశారు. రంజిత సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టనని ఆమె హెచ్చ‌రించారు. దీనిపై పోలీసులు విచారణ జ‌రుపుతున్నార‌ని ఆమె చెప్పారు. రాత్రి స‌మ‌యంలో దాడి జ‌ర‌గ‌డంతో నిందితులను గుర్తించలేకపోయాన‌ని తెలిపారు.
ఆమె తరుచు కరోనా విషయంలో రాష్ట్రప్రభుత్వ పనితీరును ప్రశ్నించినందునే ఈ దాడి జరిగి ఉండవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Related posts

నాలుగురోజులుగా తల్లి మృతదేహం …అమ్మ నిద్రపోయింది బహించిన కొడుకు !

Drukpadam

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై కేసు నమోదు!

Drukpadam

లక్ష్యం పోలీసులు ….పేలిన సామాన్యుల వాహనం ఛత్తీస్ ఘడ్ లో ఘటన

Drukpadam

Leave a Comment