తెలంగాణాలో 150 కి పెరగనున్న అసెంబ్లీ సీట్లు …మహిళలకు 50 అసెంబ్లీ సీట్లు ఖాయం …
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు ఒకే …బట్ అమలు 2029 నుంచే …
విభజన చట్ట ప్రకారం తెలంగాణ అసెంబ్లీ సీట్లు 119 నుంచి 150 కి
ఆలెక్కన మహిళలకు 50 సీట్లు కేటాయిచాల్సి ఉంటుంది..
ఎప్పటినుంచే ఉన్న డిమాండ్ …ఎంఐఎం మినహా అన్ని పార్టీల మద్దతు
ఓటింగ్ సందర్భంగా హాజరైన 456 మంది ఎంపీలు బిల్లుకు అనుకూలంగా 454 మంది
వ్యతిరేకంగా ఓటేసిన ఇద్దరు ఎంఐఎం సభ్యులు
చర్చలో పాల్గొన్న సోనియా గాంధీ తో పాటు 60 మంది సభ్యులు
లేచింది మహిళా లోకం …దద్దరిల్లింది పురుష ప్రపంచం … ఎట్టకేలకు పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందింది …అయితే ఇది అమలు కావాలంటే మరో 6 సంత్సరాలు ఆగాల్సిందే … రానున్న పార్లమెంట్ ,అసెంబ్లీ ఎన్నికలకు ఈబిల్లు వర్తించదు …2026 చివరిలో చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజన , జనాభా లెక్కలో నియోజకవర్గాలవారీగా మహిళా ఓటర్లు ఆధారంగా మహిళా రిజర్వేషన్ లు కల్పిస్తారు …పార్లమెంటల్ ప్రస్తుతం 543 స్థానాలు ఉండగా ఇందులో 33 శాతం అంటే 181 మంది మహిళలు ఎంపీలు 2029 సంవత్సరం నాటి ఎన్నికల్లో లోకసభ లో ప్రవేశించనున్నారు . ఈమేరకు రాజ్యసభలోను మహిళలకు 33 శాతం కేటాయిస్తారు …
తెలంగాణాలో ….
తెలంగాణ అసెంబ్లీలో 119స్థానాలు ఉన్నాయి. వాటిలో 33శాతం సీట్లు అంటే సుమారు 40స్థానాల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాల్సి ఉంటుంది… అయితే రాష్ట్ర పునర్విభజన చట్ట ప్రకారం తెలంగాణలో మరో 31 అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉంది.. ఆలెక్కన 50 సీట్లు మహిళకు దక్కే అవకాశం ఉంది… తెలంగాణ అసెంబ్లీలో తాజా లెక్కల ప్రకారం … 63 స్థానాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ జనాభా పెరగటానికి తరగటానికి అవకాశం ఉంది…
పురుషుల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు :
- ఆదిలాబాద్ – 114016
- బోథ్(ఎస్టీ) – 102576
- ఖానాపూర్(ఎస్టీ) – 104537
- నిర్మల్ – 122696
- ముధోల్ – 119092
- ఆర్మూర్ – 105657
- బోధన్ – 106222
- బాన్సువాడ – 94941
- నిజామాబాద్ అర్బన్ – 138615
- నిజామాబాద్ రూరల్ – 127602
- బాల్కొండ – 111424
- జుక్కల్ (ఎస్సీ) – 95512
- ఎల్లారెడ్డి – 107603
- కామారెడ్డి – 117783
- కోరట్ల – 116536
- జగిత్యాల – 109853
- ధర్మపురి(ఎస్సీ)- 107068
- మంథని – 110840
- పెద్దపల్లి – 120120
- చొప్పదండి(ఎస్సీ)- 116006
- మానకొండూర్(ఎస్సీ)- 107087
- హుజూరాబాద్ – 119632
- వేములవాడ – 107839
- సిరిసిల్ల – 116066 (కేటీఆర్)
- ఆంధోల్(ఎస్సీ) – 114077
- సంగారెడ్డి – 107750
- మెదక్ – 105075
- నర్సాపూర్ – 104712
- హుస్నాబాద్ -114218
- సిద్ధిపేట – 109938
- దుబ్బాక – 95375
- గజ్వేల్ – 126814
- తాండూర్ – 111529
- కొండంగల్ – 108157
- దేవరకొండ – 107951
- గద్వాల – 118447
- అలంపూర్(ఎస్సీ)- 111439
- నాగార్జున సాగర్ – 109992
- మిర్యాలగూడ – 107265
- నల్లగొండ – 114211
- హుజూర్ నగర్ – 117299
- కోదాడ – 114706
- సూర్యపేట – 113049
- జనగామ – 110512
- ఘన్‌పూర్ స్టేషన్(ఎస్సీ)- 117439
- మహబూబాబాద్(ఎస్టీ) – 119343
- నర్సంపేట – 110271
- వరంగల్ ఈస్ట్ – 120903
- వర్ధన్నపేట(ఎస్సీ)- 125541
- పరకాల – 105788
- వరంగల్ వెస్ట్ – 134053
- పినపాక(ఎస్టీ) – 94012
- ఇల్లందు(ఎస్టీ) – 105638
- కొత్తగూడెం – 117338
- అశ్వారావుపేట(ఎస్టీ) – 76305
- భద్రాచలం(ఎస్టీ) – 74121
- ఖమ్మం – 159527
- పాలేరు – 114636
- మధిర(ఎస్సీ) – 107698
- వైరా(ఎస్టీ) -94024
- సత్తుపల్లి(ఎస్సీ)- 115405
- నారాయణపేట – 107139
- మక్తల్ – 111870