ఖమ్మం కాంగ్రెస్ లో కిరికిరి ….ఆరు సీట్లు కావాలని పొంగులేటి పట్టు …
అన్ని ఎట్లా ఇస్తరంటున్న జిల్లా కాంగ్రెస్ నేతలు
బేషరత్ చేరికంటే ఇదేనా అంటూ పెదవి విరుపులు
ఢిల్లీలో స్క్రినింగ్ కమిటీ సమావేశం …అక్కడే మకాం వేసిన రాష్ట్రనేతలు
పొంగులేటి సైతం ఢిల్లీలోనే మకాం …
ఖమ్మం జిల్లాలో సీట్లపై పావులు కదుపుతున్న భట్టి
119 సీట్లకు 300 మంది పేర్లు …35 నియోజకవర్గాలకు ఇబ్బందులు లేవు
మిగతా నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పై మల్లగుల్లాలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ లో కొత్త పాత నేతల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతుంది ..జులై రెండవ తేదీన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్న 10 సీట్లలో 6 సీట్లు తమకే కావాలని పట్టుబడుతున్నట్లు సమాచారం … భేషరత్ గా పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన పొంగులేటి తనకు ఇన్ని సీట్లు కావాలని పట్టుబట్టడమేమిటని జిల్లాలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు .ఇదేనా భేషరత్ అంటే ఇదేనా అంటున్నారు .ఆయన కోరిన విధంగా ఎట్లా ఇస్తారనే పార్టీలో చర్చ జరుగుతుంది . పొంగులేటి తన అనుయాయులకు కోరుతున్న ఆరు సీట్లులో ఇల్లందు , పినపాక , వైరా , సత్తుపల్లి , అశ్వారావుపేట ,కొత్తగూడెం సీట్లపై ఆయన గట్టిగ అడుగుతున్నట్లు తెలుస్తుంది..
పొంగులేటి కాంగ్రెస్ లో చేరకముందే జిల్లాలో తన అనుయాయులను నియోజకవర్గ ఇంచార్జిలుగా నియమించారు . సహజంగానే ఆయన ఏ పార్టీలో చేరిన తమకు సీట్లు ఇప్పిస్తారని ఆశించారు . అయితే కాంగ్రెస్ లో చేరిన తర్వాత మొదటి సరిగా ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము నియోజకవర్గ ఇంచార్జిలను నియమించిన కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక సర్వేల ఆధారంగానే ఉంటుందని స్పష్టం చేశారు . అప్పుడు ఆయనకు కుడి ఎడమ పక్కలో కూర్చున్న కోరం కనకయ్య , పాయం వెంకటేశ్వర్లు పొంగులేటి మాటల పై అవాక్కు అయ్యారు . మొత్తం సీట్లు వచ్చే పరిస్థితి లేదు …కొత్తగా మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరడంతో ఆయన ప్రభావం కూడా జిల్లాలో ఉంది ..ఆయన పాలేరు సీటు కోరుతున్నారు . అందుకు కాంగ్రెస్ అగ్రనేతలు అంగీకరించినట్లు ప్రచారం జరుగుతుంది .. అప్పుడు పొంగులేటి ఖమ్మం లేదా కొత్తగూడం పోటీచేయాల్సిన ఉంటుంది… ఆయన కొత్తగూడెంవైపు మొగ్గుచూపుతున్నారని ,అక్కడ బీసీ అభ్యర్థిని పెట్టి ఖమ్మంలో పొంగులేటికి టికెట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరరావు ఆశలు పెట్టుకున్నారు …అయితే పొంగులేటి కోరుతున్న మిగతా ఐదు సీట్లలో పోటీచేసేందుకు అనేక మంది పోటీపడుతున్నారు .
తెలంగాణ రాష్ట్రంలో అభ్యర్థుల ఎంపికపై ఢిల్లీలో కసరత్తు చేస్తున్నారు …స్క్రినింగ్ కమిటీ సమావేశాలు జరుపుతున్నారు …దీంతో రాష్ట్ర నేతలు అంతా అక్కడే మకాం వేశారు .రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలకుగాను 300 మంది పేర్లతో ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర నేతలు కేంద్ర నేతలతో సమావేశం అవుతున్నారు .ప్రతినియోజకవర్గం నుంచి వచ్చిన పేర్ల ఆధారంగా గెలిచే అభ్యర్థులను ,వారి పూర్వ స్థితిని గురించి కేంద్ర ఎన్నికకు కమిటీ ఆరాతీస్తోంది .. ఎవరు ఎన్ని సిఫారసులు చేసిన సునీల్ కనుగోలు ద్వారా వస్తున్నా నివేదికలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది అని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు . దీంతో స్క్రినింగ్ కమిటీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది… పొంగులేటి కోరుతున్న 6 సీట్లకు అవకాశం ఎంతవరకు ఉంటుందనేది ఉత్కంఠంగా మారింది ……