Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

పరిస్థితులు కుదట పడ్డాకనే ఎమ్మెల్సీ ఎన్నికలు :సీఈ సి…

పరిస్థితులు కుదట పడ్డాకనే ఎమ్మెల్సీ ఎన్నికలు :సీఈ సి…
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా
దేశంలో కరోనా ఉద్ధృతం నేపథ్యంలో నిర్ణయం
పలు ప్రాంతాల్లో ఖాళీ కానున్న ఎమ్మెల్సీ స్థానాలు
ఏపీలో 3, తెలంగాణలో 6 మండలి స్థానాలకు ఎన్నికలు
ఇప్పట్లో ఎన్నికలు జరపలేమన్న సీఈసీ
రెండు తెలుగు రాష్ట్రాలలో జరగాల్సిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది.పరిస్థితులు కుదుటపడ్డాకనే ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది . అయితే లిమిటెడ్ సభ్యులతో జరగలిసిన ఎన్నికలు వాయిదా వేసి ఎమ్మెల్యే ,ఎంపీ , రాష్ట్రాల అసెంబ్లీ , స్థానిక సంస్థల ఎన్నికలు జరపడంపై విమర్శలు వెల్లు ఎత్తుతున్నాయి …..ఎన్నికలను ఆన్ లైన్ పద్దతిలో జరిపే దిశగా ఆలోచనలు చేయాలనీ ఆశయం మల్లి తెరపైకి వచ్చింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పట్లో జరపలేమని స్పష్టం చేసింది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండడంతో వాటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఏపీలో 3, తెలంగాణలో 6 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు చేపట్టాల్సి ఉంది.

ఏపీలో 3 స్థానాలకు ఈ నెల 31తో గడువు ముగియనుండగా, తెలంగాణలోని 6 శాసనమండలి స్థానాలకు జూన్ 3తో గడువు ముగియనుంది. అయితే, సీఈసీ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కరోనా నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేవని సీఈసీ పేర్కొంది. పరిస్థితులు అదుపులోకి వచ్చాక ఎన్నికలు జరిగే తేదీలను ప్రకటిస్తామని వెల్లడించింది.

Related posts

కేసులు పెరిగినా భయపడాల్సిన పనిలేదు: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్

Drukpadam

ఇరాక్‌లోని కొవిడ్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 44 మంది మృత్యువాత…

Drukpadam

విజయవాడలో ఆసక్తికర ఘటన.. అంత్యక్రియల తర్వాత తిరిగొచ్చిన భార్య!

Drukpadam

Leave a Comment