Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను రేపు విచారిస్తామన్న చీఫ్ జస్టిస్.. !

  • నిన్న చంద్రబాబు తరపు న్యాయవాదులు వేసిన మెన్షన్ ఆధారంగా సీజేఐ నిర్ణయం
  • రేపు విచారణ జరిపేందుకు చీఫ్ జస్టిస్ అంగీకారం
  • స్పెషల్ బెంచ్ సమావేశం నేపథ్యంలో ఈరోజు ప్రస్తావనలకు అనుమతించని చీఫ్ జస్టిస్

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దరఖాస్తు చేసుకున్న క్వాష్ పిటిషన్ పై రేపు విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. రేపు విచారణ జరిపేందుకు ఆయన అంగీకరించారు. చంద్రబాబు తరపు లాయర్లు వేసిన మెన్షన్ మెమోపై ఆయన ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఏ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ విచారణకు వస్తుందనేది ఈ సాయంత్రంలోగా తెలియనుంది.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలో క్యూరేటివ్ పిటిషన్లపై ఈరోజు స్పెషల్ బెంచ్ సమావేశమయింది. స్పెషల్ బెంచ్ సమావేశం నేపథ్యంలో… ఈరోజు ప్రస్తావనలకు చీఫ్ జస్టిస్ అనుమతించలేదు. ఈరోజు పిటిషన్ల లిస్టింగ్ కూడా జరగలేదు. ఈ నేపథ్యంలో, చంద్రబాబు తరపు న్యాయవాదులు నిన్న వేసిన మెమో ఆధారంగానే రేపు విచారిస్తామని సీజేఐ తెలిపారు.
మరోవైపు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులు ఉన్నాయి. దీంతో, చంద్రబాబు పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టులో విచారణ ఎలా ఉండబోతోందనేది ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీం ఏదైనా నిర్ణయం తీసుకుంటుందా? లేక వచ్చే వారానికి వాయిదా వేస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది. క్వాష్ పిటిషన్ లో ఏపీ ప్రభుత్వాన్ని, మాజీ సీఎస్ అజేయ కల్లంను ప్రతివాదులుగా చంద్రబాబు తరపు న్యాయవాదులు పేర్కొన్నారు.

Related posts

గౌరవ అధ్యక్షుడి పదవి నుంచి పుతిన్ ను తప్పించిన అంతర్జాతీయ జూడో సమాఖ్య!

Drukpadam

Go Wild For Western Fashion With These Pioneering Outfits

Drukpadam

అవినాశ్ రెడ్డి తల్లి హైదరాబాద్ కు తరలింపు…

Drukpadam

Leave a Comment