- చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతల ఒక రోజు నిరాహార దీక్ష
- జైలులో చంద్రబాబు.. రాజమహేంద్రవరంలో భువనేశ్వరి దీక్ష
- ఢిల్లీలో లోకేశ్‌కు మద్దతుగా కనకమేడల, గల్లా, కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు
- సాయంత్రం ఐదు గంటలకు ముగియనున్న దీక్షలు
ఇందులో భాగంగా రాజమహేంద్రవరంలో చంద్రబాబు భార్య భువనేశ్వరి, జైలులో చంద్రబాబు దీక్షకు కూర్చున్నారు. వీరికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు నేతలు దీక్ష చేపట్టారు. లోకేశ్ దీక్షలో టీడీపీ నేతలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్, కేశినేని నాని, రామ్మోహన్‌నాయుడు పాల్గొన్నారు. మంగళగిరిలో ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు దీక్షకు కూర్చున్నారు. 10 గంటలకు ప్రారంభమైన ఈ దీక్ష సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.
టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనమేడల రవీంద్ర కుమార్ ఇంట్లో ఏర్పాటు చేసిన వేదిక వద్ద లోకేశ్ దీక్షను చేపట్టారు. ఈ దీక్షలో టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని, సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్ రావులతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు కే శ్రీనివాస్ రెడ్డి కూడా హజరై లోకేశ్ కు సంఘీభావం ప్రకటించారు.