Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మసక బారుతున్న మోడీ-షాల ప్రభ ….

మసక బారుతున్న మోడీ-షాల ప్రభ ….
-పక్కన పెట్టేందుకు ఆర్ ఎస్ ఎస్ సిద్ధాంత కర్తలు సిద్ధమైయ్యారా ?
-నాగపూర్ హెడ్ క్వార్టర్ ఏమి ఆలోచన చేస్తుంది ?
-బెంగాల్ ,తమిళనాడు లో వారి వ్యూహం బెడిసి కొట్టిందా ?
-ఉత్తరప్రదేశ్ ఎన్నికలపై మోడీ,అమిత్ షా ఫోకస్
-యూ పీ స్థానిక ఎన్నికల్లో వెనకబడ్డ బీజేపీ
-ముఖ్యమైన రాష్ట్రాలలో పాలనకు బీజేపీ దూరం
దేశంలో 2014 , 2019 లలో రెండు సార్లు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన మోడీ గత ఏడుసంత్సరాలుగా దేశానికి తిరుగులేని పాలనా అందించారని ప్రశంసించిన వర్గాలే నేడు నేడు తెగుడుతున్నాయి. దీనికి కారణాలు వెతుకుతున్నాయి . మోడీ -అమిత్ షా నాయకత్వంలోని బీజేపీ ప్రభావం తగ్గిందా ….? మోడీ ,అమిత్ షా ద్వయం పై దేశ ప్రజలకు నమ్మకాలు, విశ్వాసం తగ్గిందా …? ప్రజలకే కాదు వారిని నమ్ముకొని అధికారాన్ని వారిచేతుల్లో పెట్టిన ఆర్ ఎస్ ఎస్ కు నమ్మకం సన్నగిల్లిందా ….? కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మోడీ సర్కార్ విఫలమైందని ,జాతీయంగా ,అతర్జాతీయంగా దేశం అపఖ్యాతి మూటగట్టుకుందా…? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు …. మోడీ గత సంవత్సర కాలం వరకు దేశరాజకీయాలలో తిరుగులేని వ్యక్తిగా వెలుగొందరు. ప్రపంచ దేశాలలో సైతం మోడీ పేరు మారుమోగింది. మాజీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో పోల్చుతూ మోడీ హొది ,అని కీర్తించారు…..ట్రాంప్ ను భారత్ ఆహ్వానించి గుజరాత్ లో కరోనా సమయంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు.కొద్దీ కాలంలోనే మోడీ తిరిగినన్ని దేశాలు గతంలో ఏ భారత ప్రధాని తిరగలేదు … హోహో మోడీ ఆహ మోడీ అన్నారు. భారత దేశ ప్రతిష్టను విదేశాలలో వినుమడింపజేసిన గొప్ప నాయకుడిగా కీర్తించారు.
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలుపు భాద్యతను భుజాలకు ఎత్తుకున్న మోడీ-షా ల ద్వయం ఘోరప్రభావాన్ని చవిచూసింది.ప్రధానంగా ,పశ్చిమ బెంగాల్ ,తమిళనాడు రాష్ట్రాలలో వారి వ్యూహం బెడిసి కొట్టింది. బెంగాల్ లో మమతా బెనర్జీ ని ఓడించాలని చేయని ప్రయత్నంలేదు. అయినా బెంగాల్ ప్రజలు బీజేపీని నమ్మలేదు .తమిళనాడులో బీజేపీ కూటమి ఓటమి చవిచూసింది ,కేరళలో ఉన్న ఒక్క సీటు కూడా దక్కించుకోలేక పోయింది.
దేశంలో పెద్దగా సంపద పెరగలేదు . ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రవేట్ పరం చేస్తున్నారు. లేదా మూసి వేస్తున్నారు. అప్పులు పెరిగిపోతున్నాయి. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనం తేలేదు .నిరుద్యోగం పెరిగింది. పరిశ్రమలు మూతపడ్డాయి. కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు . ఎంతసేపటికి నెగిటివ్ రాజకీయాలవైపు ద్రుష్టి సారించారు తప్ప గత పాలకులు చేసినవన్నీ తప్పులుగాను వారు నేరగాళ్లుగా ముద్రవేసే పనికి పూనుకున్నారు. 3 వేల కోట్లతో సర్ధార్ వల్లభాయ్ పటేల్ నర్మదా నది ఒడ్డున ఏర్పాటు చేయడం విమర్శలకు దారితీసింది. ఢిల్లీ లో పార్లమెంట్ భవన్ నిర్మాణానికి విస్టా ప్రాజక్టు పేరుతో 20 వేల కోట్ల ఖర్చు పెట్టి కరోనా సమయంలో దాని నిర్మాణం చేపట్టడం పై అభ్యంతరాలు ఉన్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చినతరువాత దేశంలో మత రాజకీయాలు , ప్రాంతీయ రాజకీయాలు ఎక్కువైయ్యాయని అభిప్రాయాలూ ఉన్నాయి. పౌరసత్వ బిల్లు పై అనేక రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. దేశరాజధానిలో కాల్పులకు దారితీసింది. వ్యవసాయ చట్టాలపై రైతులు చేస్తున్న ఆందోళనలు 180 రోజులు దాటింది. దానిపై కేంద్రం వైఖరిని సుప్రీం కోర్ట్ సైతం తప్పు పట్టింది. రైతుల ఆందోళనలు విరమించుకోమని చెప్పలేమని స్పష్టం చేసింది.కరోనా విషయంలో కేంద్రం పై విమర్శల జడివాన కురిసింది. మందులు లభించక , హాస్పిటల్స్ లో బెడ్స్ దొరక్క , ఆక్సిజన్ కొరత ,వ్యాక్సిన్ల కొరత తో మోడీ సర్కార్ పై ఇంట బైట విమర్శలు ఎదుర్కొన్నది .ఇది ముందు చూపు లేని పాలనకు నిదర్శనమని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.ప్రధాని మోడీ కి 12 ప్రతిపక్షాలు లేఖ రాశాయి.

ఏడేళ్ల మోడీ ప‌రిపాల‌న ప్ర‌జ‌ల‌కే కాదు, ఆర్ఎస్ఎస్ కు కూడా చిరాకు, ఆగ్ర‌హం, అస‌హ‌నం తెప్పిస్తున్నాయ‌ని, ప్రచారం జరుగుతుంది. మోడీ నాయకత్వం పట్ల బీజేపీ లోను, నాగపూర్ హెడ్ క్వార్టర్ నాయకత్వ మార్పు వైపు ఆలోచనలు చేసుతున్నారని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి . ఏడేళ్ల క్రితం యువ‌త‌, మ‌ధ్యత‌ర‌గతి వ‌ర్గాల మ‌ద్ద‌తుతో బ్ర‌హ్మోండ‌మైన మోడీ నాయకత్వంలో బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది . కాంగ్రెస్ అవినీతితో విసిగిపోయ‌న ప్ర‌జ‌లు మోడీలో ఒక సమర్ధుడైన నాయకున్ని ప్రజలు చూశారు మార్పును కోరుకున్నారు . ఆయ‌న అధికారంలోకి వ‌స్తే భార‌త‌దేశంలో అవినీతి ఉండద‌ని, నిరుద్యోగులకు ఏడాదికి కోటి ఉద్యోగాలు , యువ‌త‌కు ఉపాధి ల‌భిస్తుంద‌ని, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల స‌ర‌స‌న చేర‌తామ‌ని అనుకున్నారు . కానీ అది జరగలేదు సరికదా మోడీ పట్ల ప్రజల్లో భ్రమలు తొలిగాయని పరిశీలకులు భావిస్తున్నారు .

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌లు త‌రువాత బీజేపీ లో పెద్ద ఎత్తున ప్రక్షాళన జరుగుతుందని ప్రచారం జరుగుతుంది . ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌డానికి తొమ్మిది నెల‌లు స‌మ‌యం ఉంది. ఈలోపు మోడీ గ్రాఫ్ స్థిరంగా ఉంటుందా ? పెరుగుతుందా ? తరుగుతుందా ? అనే ఆశక్తి నెలకొన్నది . దేశంలో అత్యంత శ‌క్తివంత‌మైన ప్ర‌ధానిగా పేరు తెచ్చుకున్న మోడీ క‌రోనా క‌ట్ట‌డిలో విఫ‌ల‌మ‌యి ప్ర‌జ‌ల విశ్వాసాన్ని కోల్పోయారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.

Related posts

సెంట్రల్ విస్టా పై నిన్న ప్రియాంక ,నేడు రాహుల్ ధ్వజం!

Drukpadam

అఖిలేష్ జిన్నాపై వ్యాఖ్యలు ఎస్పీ ,బీజేపీ ఆడుతున్న నాటకంలో భాగం:మాయావతి

Drukpadam

జనసేనాని కార్యకర్తలు విడుదలైయ్యేవరకు విశాఖను వీడను : పవన్ కల్యాణ్!

Drukpadam

Leave a Comment