Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర… ఈ నెల 10న షెడ్యూల్, రూట్ మ్యాప్ ఖరారు!

  • తెలంగాణలో ఎన్నికల వాతావరణం 
  • సమాయత్తమవుతున్న ప్రధాన పార్టీలు
  • మూడ్రోజుల పాటు రాహుల్  బస్సు యాత్ర

మరో రెండు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో మూడ్రోజుల పాటు బస్సు యాత్ర చేయనున్నారు. ఈ నెల 19 నుంచి 21 వరకు రాహుల్ రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటన తేదీలు ఖరారు కావాల్సి ఉంది. 

కాగా, రాహుల్ బస్సు యాత్రలో ఇతర కాంగ్రెస్ జాతీయ నేతలు కూడా పాల్గొనే అవకాశమున్నట్టు తెలుస్తోంది. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా ఈ బస్సు యాత్రలో పాల్గొనేలా ఒప్పించాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. 

ఈ నెల 10న హైదరాబాదులో కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ బస్సు యాత్ర షెడ్యూల్, రూట్ మ్యాప్ పై స్పష్టత రానుంది. 

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 6 గ్యారెంటీలను ప్రకటించడం తెలిసిందే. కర్ణాటక తరహాలో తెలంగాణలోనూ తమ గ్యారెంటీలు  విజయాన్ని అందిస్తాయని కాంగ్రెస్ ధీమాగా ఉంది. అయితే, ఆరు గ్యారెంటీలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందుకు రాహుల్ బస్సు యాత్ర తోడ్పడుతుందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

Related posts

బండి సంజయ్ మాటల వెనక మర్మమేంటి …?

Ram Narayana

ఆ కార్యక్రమానికి లక్ష్మీపార్వతిని ఆహ్వానించకపోవడం సరికాదు: ఉండవల్లి

Ram Narayana

పార్టీకి చెడ్డపేరు తేకండి …పువ్వాడ నాగేశ్వరావు కు సిపిఐ జాతీయకార్యదర్శి నారాయణ లేఖ!

Ram Narayana

Leave a Comment