Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

పార్టీకి చెడ్డపేరు తేకండి …పువ్వాడ నాగేశ్వరావు కు సిపిఐ జాతీయకార్యదర్శి నారాయణ లేఖ!

ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ సిపిఐ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు సిపిఐ పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న తీరును తప్పుపడుతూ ఆపార్టీ జాతీయ కార్యదర్శి కె .నారాయణ లేఖ రాశారు… “ఈ ఉత్తరం ఎప్పుడో రాయాల్సి ఉన్న మిగతా చరిత్ర దృష్ట్యా రాయలేక పోయాను …మీ చర్యలను గమనించి ఇక భరించలేక ఈ ఉత్తరం రాస్తున్నాను”.. అంటూ ఆలేఖలో అనేక విషయాలు ప్రస్తావించారు … ఉత్తరం ఆయన మాటల్లోనే … తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి…మీ కుమారుడు రాజకీయాల్లోకి ప్రవేశించింది మొదలు మీలో మార్పులు వచ్చాయి.. తండ్రి ,కొడుకులు ఒకే పార్టీలో ఉండాలని లేదు …కేరళలో మన పార్టీలో ఉన్న గౌరీ ,గౌరీ థామస్ చెరొక పార్టీలో ఉన్నారు …నీలం రాజశేఖర్ రెడ్డి , నీలం సంజీవ రెడ్డి సొంత అన్నదమ్ములు అయిన వేరు వేరు పార్టీలో క్రీయాశీలకంగా ఉన్నారు … ఈలాంటి ఉదాహరణలు ఎన్నో మీకు తేలింది కాదు …

మీరు సిపిఐ లో ప్రముఖపాత్ర వహించారు ..రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు ..ఖమ్మంజిల్లాలో పార్టీని ఉన్నత స్థానంలో నిలిపారు …మీ సేవను పార్టీగాని .ప్రజలుగాని మర్చి పోలేదు …ప్రస్తుతం ఆరోగ్య రీత్యా క్రీయాశీలకంగా వ్యవహరించకపోయిన మీరు సాధారణ సభ్యులుగా పార్టీ చూడలేదు …మీరుఎక్కడ సభలకు వచ్చిన పార్టీ మిమ్ములను అదే స్థాయిలో గౌరవం ఇస్తుంది…చివరికి ఖమ్మం జిల్లా కార్యాలయం ముందు కూడా మీ ప్లెక్సీ నేటికీ ఉంది ..
ఇంత గౌరం పొందుతున్న మీరు పార్టీకి ఇస్తున్న మర్యాద ఏది ..? మీ అబ్బాయి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీలు మారుతూ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు ….ప్రతి సందర్భంలో మీ అబ్బాయిని సమర్థిస్తున్నారు తప్ప పార్టీ తీసుకున్న నిర్ణయాలను సమర్దించడంలేదు ….ప్రస్తుతం దేశ రాష్ట్ర రాజకీయాల్లో సిపిఐ ఒకే విధానాన్ని తీసుకున్నది …అందుకు అనుగుణంగా మీరు వ్యవహరించడం లేదు …పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కాంగ్రెస్ లో పొత్తులో భాగంగా కొత్తగూడెం నుంచి పోటీచేస్తున్నారు …ఆయనకు మద్దతుగా ఒక్క ప్రకటన మీ నుంచి రాలేదు …పైగా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న బీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న మీ కుమారుడిని సమర్థిస్తున్నారు…. అందువల్ల ఇది ఎంత మాత్రం సమర్థనీయం కాదు ..ఖమ్మం జిల్లా పార్టీ ఆఫీస్ ముందు పెట్టిన ప్లేక్సీ ని మీరే తొలగించే ఏర్పాటు చేయండి ..అంటూ నారాయణ రాసిన లేక సంచలనంగా మారింది…

Related posts

బర్రెలక్క ప్రచారానికి యానాం ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రూ. లక్ష సాయం

Ram Narayana

తొమ్మిదిన్నరేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు: ప్రియాంక గాంధీ

Ram Narayana

కంగారు పడొద్దు.. మనమే గెలుస్తున్నాం: కేసీఆర్

Ram Narayana

Leave a Comment