తెలంగాణ రాజకీయ వార్తలు ..

మోదీని కలిస్తే బీజేపీలో చేరుతున్నట్లా?: మీడియా ప్రతినిధుల ప్రశ్నకు మల్లారెడ్డి అసహనం…

  • బీజేపీలోకి వెళతారని హాట్ టాపిక్ నడుస్తోంది కదా అన్న మీడియా ప్రతినిధి
  • తాను బీఆర్ఎస్‌లోనే ఉన్నానని స్పష్టం చేసిన మల్లారెడ్డి
  • బయట జరిగే ప్రచారంతో తనకు సంబంధం లేదని వ్యాఖ్య

“మీరు బీజేపీలో చేరుతున్నారా” అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బీఆర్ఎస్ నాయకుడు, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసేందుకు వెళితే బీజేపీలో చేరుతున్నట్లా? అని అసహనం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ యువ నాయకుడు టింకు గౌడ్ ఆధ్వర్యంలో బోయినపల్లిలో జరిగిన పలు సేవా కార్యక్రమాల్లో మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయనను చుట్టుమట్టి, మీరు ప్రధాని మోదీని కలవడంతో బీజేపీలోకి వెళతారనే హాట్ టాపిక్ నడుస్తోంది కదా, మీరేమంటారని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.

మల్లారెడ్డి స్పందిస్తూ, అది హాట్ టాపిక్ ఏమిటి, ప్రధానిని కలిస్తే బీజేపీలో చేరుతారా, సామాజిక మాధ్యమాల్లో జరిగే ప్రచారానికి తాను స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. బయట జరిగే ప్రచారంతో తనకు సంబంధం లేదని అన్నారు. తాను బీఆర్ఎస్‌లోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు.

Related posts

పార్టీ మారడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Ram Narayana

డ్రగ్స్ టెస్ట్ పై మహేష్ గౌడ్ సవాల్ కు సై అన్న కేటీఆర్ …

Ram Narayana

తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కరే కాదు.. బీజేపీ కూడా పోరాడింది: రాజ్‌నాథ్ సింగ్

Ram Narayana