ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ …

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ …

కష్టపడితే సాధారణ కార్యకర్తకు కూడా పోలిట్‌ బ్యూరోలో చోటు వస్తుందన్న లోకేష్ 

నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో లోకేశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

 కార్యకర్తల సంక్షేమం కోసం రూ.160 కోట్లు వెచ్చించినట్లు వెల్లడి

వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు పెరిగాయన్న మంత్రి

టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మంత్రి నారా లోకేష్ ను నియమించారు ..ఇప్పటివరకు టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ లేరు ..కొత్తగా దాన్ని లోకేష్ కోసమే ప్రత్యేకంగా పార్టీ నిబంధనల్లో మార్పు చేసి పెట్టారు ..ఇప్పటివరకు ఆయన పార్టీలో ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు ..వైసీపీ పాలనను విధ్వంసంతో పోలిక ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనకడుగు వేయని కార్యకర్తల కష్టం వల్లే తాము ఈ స్థాయిలో ఉన్నామని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు. వారి సంక్షేమం కోసం ఇప్పటికే రూ.160 కోట్లు వెచ్చించినట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ తెలుగువారికి గుర్తింపునిస్తే, చంద్రబాబు ఈ జాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారని కొనియాడారు. మంగళగిరిలో జరిగిన తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అందరం కలిసే ముందుకు.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు పెరిగాయని లోకేశ్‌ అన్నారు. కానీ, తనలో ఏమాత్రం అహంకారం లేదని పేర్కొన్నారు. ‘యువగళం’ పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూశానని, అందరినీ కలుపుకొని ముందుకెళతానని చెప్పారు. మహానాడులో తీసుకున్న ఆరు కీలక నిర్ణయాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కార్యకర్తల పనితీరును గమనించేందుకే ‘మై టీడీపీ’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామన్నారు. కష్టపడితే సాధారణ కార్యకర్తకు కూడా పొలిట్ బ్యూరోలో చోటు దక్కుతుందని భరోసా ఇచ్చారు. అబద్ధాలపై సమరం వైసీపీ పాలనను ‘విధ్వంసం’తో పోల్చిన లోకేశ్, తమ లక్ష్యం కేవలం ‘అభివృద్ధి’ అని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు ప్రచారం చేసే అసత్యాలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. అహంకారం పెరిగితే ఏమవుతుందో 2024 ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఎద్దేవా చేశారు. జగన్ పార్టీది కేవలం క్రెడిట్ చోరీ జబ్బు మాత్రమేనని, ఆ పార్టీకి ఎండ్ కార్డ్ వేసే బాధ్యత పసుపు సైన్యానిదేనని ధీమా వ్యక్తం చేశారు.

Related posts

టీడీపీ ,జనసేన పొత్తుల కసరత్తు ….పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు …

Ram Narayana

సోము సవాల్‌కు ఉండవల్లి సై.. టైమ్, ప్లేస్ చెప్పాలన్న ఉండవల్లి!

Ram Narayana

రేపో ఎల్లుండో నన్ను అరెస్ట్ చేసినా చేస్తారు: చంద్రబాబు

Ram Narayana