- జులైలో మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తానన్న విజయసాయి
- త్వరలోనే మీడియా రంగంలోకి కూడా అడుగుపెడతానని వెల్లడి
- గత ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్య
- ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందని అభిప్రాయం
- తన నివాసంలో ఈడీ సోదాల్లో ఏమీ దొరకలేదని స్పష్టం
- ఏపీలో విజయసాయి ఆధ్వరంలో కొత్త రాజకీయపార్టీ …
- ఎన్డీయే కనుసన్నల్లోనే పార్టీ అంటున్న పరిశీలకులు
- వైసీపీ టార్గట్ గానే విమర్శలు గుప్పించిన విజయసాయి రెడ్డి
మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే జులై నెల నుంచి తాను మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ మద్యం కేసులో భాగంగా తన నివాసంలో ఈడీ సోదాలు ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాజకీయాల్లోకి పునరాగమనం చేయడమే కాకుండా, త్వరలోనే మీడియా రంగంలోకి కూడా అడుగుపెడుతున్నట్లు విజయసాయి రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విమర్శలు చేశారు. గత ఎన్నికల్లో ప్రజలు ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించాల్సిన అవసరం ఉందని అన్నారు.
అంతకుముందు తన నివాసంలో జరిగిన ఈడీ సోదాలపై ఆయన స్పందించారు. అధికారుల సోదాల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదని, తన వద్ద ఏమీ దొరకలేదని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. అయితే, ఈడీ తనను విచారణకు పిలిచే అవకాశం ఉందని అన్నారు.
ఏపీ లో కొత్త రాజకీయ పార్టీ పుడుతుందని చాలాకాలంగా మాటలు వినిపిస్తున్నాయి…అదికూడా వైసీపీని దెబ్బతీసేవిధంగా ఉండవచ్చునని ప్రచారం జరుగుతుంది ..దాన్ని నిజం చేస్తూ మాజీ వైపీసీ రాజ్యసభ సభ్యులు ,ఒకప్పుడు ఆపార్టీలో నెంబర్ టు గా ఉన్న విజయసాయి రెడ్డి కొత్త పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు ..కొంతకాలం క్రితం ఆయన వైసీపీకి ,రాజ్యసభ సభత్వానికి రాజీనామా చేశారు …ఆ సందర్భంగా తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని తన శేష జీవితం వ్యవసాయానికి అంకితం చేస్తానని ప్రకరించారు ..నిబద్దత కలిగిన నాయకుడుగా పేరున్న విజయసాయి రెడ్డికి తన మాటలపై తానే నిలబడకపోవడం మైనస్ గా ఉంది..తాను రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పడంతోపాటు కొత్తగా మీడియా రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించడం విశేషం ..
Save or share this story as a newspaper-style Epaper Clip: