Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఖమ్మం బీఆర్ యస్ లో ప్రకంపనలు …ఆటమొదలైందన్న పొంగులేటి ,తుమ్మల…!

ఖమ్మం బీఆర్ యస్ లో ప్రకంపనలు …ఆటమొదలైందన్న పొంగులేటి ,తుమ్మల
బాలసాని తోసహా పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖత
తనకు పార్టీలో అవమానం జరిగిందంటున్న బాలసాని
గురువర్యులు తుమ్మల బాటలోనే తన ప్రయాణమని స్పష్టికరణ
తుమ్మల ,పొంగులేటి సంయుక్త పర్యటనలు
కమర్తపు మురళి ,చావా నారాయణ షౌకత్ ,ఖమర్ కాంగ్రెస్ కు జై
ఖంగు తిన్న బీఆర్ యస్ శిభిరం … మరికొందరు ముఖ్యనేతలు చేరే అవకాశం

నిన్నమొన్నటివరకు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి పువ్వాడ అజయ్ మీద పోటీకి ఎవరు సిద్దపడటంలేదని, ఆయన మీద పోటీకి జంకుతున్నారని, పోటీ ఏకపక్షమే అనే ప్రచారం జరిగింది….కానీ నేడు సీన్ మారింది…ఖమ్మం అసెంబ్లీ సీటు మాజీమంత్రి సీనియర్ నేత తుమ్మల నాగేశ్వరరావుకు కేటాయించారని వార్తలు రావడంతో ఒక్కసారిగా వాతావరణం మారింది …పలువురు బీఆర్ యస్ నేతలు ఆపార్టీకి బై చెప్పి కాంగ్రెస్ జైకొట్టి తుమ్మల , పొంగులేటి వెంట నడిచేందుకు సిద్ధమైయ్యారు . వారిలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ తో పాటు పలువురు కార్పొరేటర్లు , ముఖ్యనేతలు ఉండటం గమనార్హం ….

ఢిల్లీలో టికెట్స్ కన్ఫర్మ్ చేసుకున్న తుమ్మల పొంగులేటి లు ఆదివారం ఉదయం ఉదయం ఢిల్లీ నుంచి నేరుగా ఖమ్మం లోని బీఆర్ యస్ నేత మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఇంటికి చేరుకున్నారు . అప్పటికే బాలసాని బీఆర్ యస్ కు రాజీనామా చేసి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు తన రాజీనామా లేఖను పంపారు … తుమ్మల , పొంగులేటి కొంత సేపు బాలసానితో మాట్లాడారు . తన ఇంటికి వచ్చిన నేతలకు మర్యాద పూర్వకంగా బాలసాని శాలువాలు కప్పి సత్కరించారు .

కాంగ్రెస్ పార్టీలో చేరమని ఆహ్వానించేందుకు తుమ్మల ,పొంగులేటి వచ్చారని వారి ఆహ్వానం పై చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటానని వారికీ హామీ ఇచ్చినట్లు తెలిపారు . ఈసందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరు ఆపలేరని అన్నారు . ఇప్పటివరకు ఒక ఎత్తు ఇక నుంచి మరో ఎత్తు ఆటమొదలైంది…కేసీఆర్ మోసం ,దగా మాటలను ప్రజలు విశ్వసించడం లేదని అన్నారు . దళితులకు మూడెకరాల భూమి , దళిత ముఖ్యమంత్రి , టీఎస్ పిఎస్పీ అవకతవకలు , అన్ని దగా మాటలే అని ప్రజలకు అర్ధం అయ్యాయని అన్నారు . తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు …ఆయన అప్రకటించిన విధంగా నిరుద్యోగ భృతి లేదు …కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎవరు అన్నం తినలేదు …తాను వచ్చిన తర్వాతనే అన్నం తింటున్నట్లుగా చెప్పడం విడ్డురంగా ఉందని అన్నారు . రాష్ట్రంలో శ్రీశైలం ,నాగార్జునసాగర్ , శ్రీరాంసాగర్ ప్రాజక్ట్ లు కట్టించింది కాంగ్రెస్ కదా …?అని వారు ప్రశ్నించారు . అన్నిట్లో అవినీతి ,కుటుంబ పాలన చివరకు ప్రజాప్రతినిధులకు కూడా విలువలేదు ….ఇదేమంటే తమ పార్టీ తమ ఇష్టం అన్నట్లు ఉంది వ్యవహారం ఇందుకేనా మనం తెలంగాణ తెచుకున్నదని ఒక పక్క ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కల్వకుంట్ల ఫ్యామిలీపై ధ్వజమెత్తారు ..

తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతు బాలసాని తనకు మొదటి నుంచి అనుచరుడిగా ఉన్నారని అందువల్లనే ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించేందుకు వచ్చామని అన్నారు . మా ఆహ్వానాన్ని మన్నించి మాతో కల్సి నడుస్తానని అన్నారని ఇది సంతోషించ దగ్గ విషయమని అన్నారు .గతంలో జిల్లాను ఏవిధంగా అభివృద్ధి చేసుకున్నామో తిరిగి అదే విధంగా చేసుకుందామని అన్నారు . జిల్లాలో అనేక పెండింగ్ ప్రాజెక్ట్ లు పూర్తీ చేయాల్సి ఉందని అన్నారు . అందుకు ప్రజలు ఆలోచించాలని అన్నారు .

తాతా మధు పుడింగా …? బాలసాని ఫైర్

ఖమ్మం జిల్లా బీఆర్ యస్ అధ్యక్షులు , ఎమ్మెల్సీ తాతా మధు ఏమైనా పుడింగా …? ఆయన ఎక్కడ నుంచి వచ్చారు …అమెరికా నుంచి వచ్చి పుడింగినని చెప్పి ఆయనకు ఎమ్మెల్సీ పదవి ,జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వడం దారుణమని అన్నారు .. చివరకు తాను అడగకుండానే ఇచ్చిన భద్రాచలం నియోజకవర్గ ఇంచార్జి పదవి కూడా తనకు తెలియకుండానే తీసివేయడం ఎలాంటి న్యాయమో చెప్పలేక పోయారని అన్నారు . తనకు ఎమ్మెల్సీ పదవి ఇప్పిస్తానని చెప్పిన మంత్రి పువ్వాడ తనకు ఇప్పించిక పోవడం ఒక బీసీని తీసి నాకు కాకుండా ఎవరికైనా బీసీకి ఇచ్చారా ..? అంటే అదిలేదని అన్నారు . పార్టీలో తనను ఎలాంటి ప్రోటోకాల్ లేకుండా ఆగౌరపరచడం ,అవమానపరచడం పై మండిపడ్డారు . తాను ఏ పదవి ఆశించకుండా పార్టీలో పనిచేద్దామని అనుకుంటే కనీస గౌరవమర్యాదలు లేవని అన్నారు . తనదగ్గరకు వచ్చిన మంత్రి పువ్వాడ , ఎంపీ వద్దిరాజుతో అదే చెప్పానని అన్నారు . మంత్రులు కేటీఆర్ ,హరీష్ రావులతో మాట్లాడించారని వారికీ కూడా తనకు జరిగిన అవమానాల గురించి చెప్పానని అన్నారు .

తాతా మధుకు జిల్లా అధ్యక్ష భాద్యతలు ఇస్తే బీఆర్ యస్ జిల్లా కార్యాలయానికి తాళం వేశారు …

తాతా మధుకు ఎమ్మెల్సీ ఉండగా జిల్లా అధ్యక్షులుగా భాద్యతలు అప్పగించారు . గతంలో నిత్యం ప్రజలు కార్యకర్తలతో కళకళలాడే జిల్లా కార్యాలయం ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత ఈగలు కొట్టుకుంటుంది…కార్యాలయం తెరిచినాడోడు లేడు,తాళం వేశారు . రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కార్యాలంకు తాళం వేసి ఉంచేందుకేనా అధ్యక్ష పదవి అని బాలసాని అన్నారు .

బాలసాని ఇంటిదగ్గర నుంచి ఆయన్ను వెంట బెట్టుకొని ఖమ్మం నగరంలోని శ్రీరాంహిల్స్ లో ఉన్న కార్పొరేటర్ కమర్తపు మురళి ఇంటికి వెళ్లారు . అక్కడే మాజీ కార్పొరేటర్ చావా నారాయణ ఉన్నారు .అక్కడ నుంచి మరి కొందరితో టచ్ లోకి పోయారు . దీంతో ఖమ్మం బీఆర్ యస్ లో ఏమి జరుగుతుందనే అయోమయమం నెలకొన్నది …కొందరు ముఖ్యనేతలు పార్టీ మారుతున్నారని విషయం తెలుసుకున్న మంత్రి అజయ్ అలర్ట్ అయ్యారు …మిగతా కార్పొరేటర్లను జారకుండా ఉండే పనిలో యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు …

Related posts

కాంగ్రెస్ అభ్యర్థుల నాల్గొవ జాబితా …సూర్యాపేట లో పటేల్ రమేష్ రెడ్డికి మళ్ళీ నిరాశ…

Ram Narayana

బీఆర్ఎస్‌కు కృష్ణయాదవ్ రాజీనామా, నాలుగైదు రోజుల్లో కీలక ప్రకటన!

Ram Narayana

కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీల హవా: మాజీ సీఎం కేసీఆర్

Ram Narayana

Leave a Comment