Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

బీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం కేసీఆర్

  • నవంబరు 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు
  • సమరశంఖం పూరించిన సీఎం కేసీఆర్
  • నేడు తెలంగాణ భవన్ కు విచ్చేసిన బీఆర్ఎస్ అధినాయకుడు
  • వివిధ జనాకర్షక పథకాలతో మేనిఫెస్టో ప్రకటన

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీ (నవంబరు 30) వెల్లడైన నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించారు. ఇవాళ హైదరాబాదులోని తెలంగాణ భవన్ కు వచ్చిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇటీవల కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు పోటీ ఇచ్చేలా బీఆర్ఎస్ మేనిఫెస్టోలోని అంశాలు ఉన్నాయి. మేనిఫెస్టో విడుదల సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ స్కీములు ఆషామాషీగా ఉండవని, దేశానికే ఆదర్శంగా ఉంటాయని స్పష్టం చేశారు.

మేనిఫెస్టో అంశాలు…

  • సౌభాగ్యలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి
  • తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు కేసీఆర్ బీమా పథకం…93 లక్షల  కుటుంబాలకు లబ్ది
  • రూ.5 లక్షలతో బీమా సౌకర్యం… ప్రీమియం ప్రభుత్వమే చెల్లించేలా ఏర్పాట్లు 
  • సాధారణ మరణానికి కూడా కేసీఆర్ బీమా వర్తింపు
  • తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు సన్న బియ్యం… ‘తెలంగాణ అన్నపూర్ణ’ పథకం ద్వారా సన్నబియ్యం సరఫరా
  • ఆసరా పింఛన్ల మొత్తం దశలవారీగా పెంపు
  • పింఛన్లు ఏడాదికి రూ.500 చొప్పున రూ.5 వేల వరకు పెంపు
  • రైతు బంధు మొత్తం దశలవారీగా రూ.16 వేల వరకు పెంపు… ముందుగా రూ.12 వేలకు పెంపు
  • అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్
  • జర్నలిస్టులకు రూ.15 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు
  • ఆరోగ్యశ్రీ బీమా మొత్తం రూ.15 లక్షలకు పెంపు
  • దివ్యాంగులకు పెన్షన్ రూ.6 వేలకు పెంపు
  • పేద మహిళలకు రూ.400కే గ్యాస్ సిలిండర్
  • హైదరాబాదులో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం
  • అనాథ బాలల కోసం పటిష్టమైన అర్బన్ పాలసీ
  • అసైన్డ్ భూములపై ఆంక్షల ఎత్తివేత
  • ఇంటి స్థలం లేని పేదలకు ఇళ్ల స్థలాలు
  • అసైన్డ్ భూముల సొంతదారులకు పట్టా హక్కులు
  • ఓపీఎస్ డిమాండ్ పై ఉన్నతాధికారులతో కమిటీ

Related posts

గ్రహాంతరవాసి ద్వారా గర్భవతైన మహిళ: సంచలనం రేపుతున్న పెంటగాన్ రిపోర్ట్!

Drukpadam

ఎన్నికల ప్రచారంలో కళ్లు తిరిగి పడిపోయిన కవిత.. వీడియో ఇదిగో!

Ram Narayana

ఎట్టకేలకు పిన్నెల్లి సోదరులపై పోలీసుల రౌడీషీట్?

Ram Narayana

Leave a Comment