Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. 22 మంది మృతి

  • మైన్ రాష్ట్రంలోని లెవిస్టన్ నగరంలో బుధవారం రాత్రి ఘటన
  • ఓ బౌలింగ్ యాలీ, మరో బార్ అండ్ రెస్టారెంట్‌లో ఆగంతుకుడి కాల్పులు
  • సెమీ ఆటోమేటిక్ ఆయుధంతో కాల్పులకు తెగబడటంతో 22 మంది మృత్యువాత
  • నిందితుడి కోసం పోలీసుల విస్తృత గాలింపు

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం రేగింది. మైన్ రాష్ట్రంలోని లెవిస్టన్ నగరంలో బుధవారం రాత్రి ఓ ఆగంతుకుడు కాల్పులకు తెగబడటంతో 22 మంది దుర్మరణం చెందారు. సెమీ ఆటోమేటిక్ తుపాకీతో నిందితుడు ఓ బౌలింగ్ యాలీ, మరో రెస్టారెంట్‌లో విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డాడు. స్థానిక మీడియా కథనాల ప్రకారం ఈ ఘటనలో మరో 60 మంది గాయాల పాలయ్యారు.

ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. అతడి ఫొటోను కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ ప్రాంతంలోని వ్యాపారాలను మూసేయాలని పోలీసులు స్థానికులకు సూచించారు. కాగా, ఈ దారుణంపై మెయిన్ చట్టసభ సభ్యుడు జేరెడ్ గోల్డెన్ ‘ఎక్స్’ వేదికగా విచారం వ్యక్తం చేశారు. తాను భయభ్రాంతులకు లోనైనట్టు చెప్పుకొచ్చారు.

Related posts

కాబోయే భార్యకు అమెజాన్ అధినేత రూ.560 కోట్లతో గిఫ్ట్

Ram Narayana

30 కోట్ల సబ్‌స్క్రైబర్లను సాధించిన తొలి యూట్యూబర్ ఇతడే!

Ram Narayana

విదేశాల్లోనే అత్యధిక యూనికార్న్‌లను స్థాపించిన భారతీయులు

Ram Narayana

Leave a Comment