Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కాంగ్రెస్ కు పీజేఆర్ కొడుకు రాజీనామా…అదే దారిలో మరికొందరు ..

  • జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి భంగపడ్డ విష్ణువర్ధన్
  • అజారుద్దీన్ కు టికెట్ కేటాయించిన కాంగ్రెస్ అధిష్ఠానం
  • పీజేఆర్ కూతురుకు ఖైరతాబాద్ టికెట్

కాంగ్రెస్ విడుదల చేసిన రెండో జాబితా తర్వాత పార్టీలో అసంతృప్తుల సంఖ్య పెరిగిపోతోంది. పార్టీ టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు అధిష్ఠానంపై భగ్గుమంటున్నారు. ఎలాగైనా పోటీ చేసితీరతామని చెబుతున్నారు. ఇంతకాలం పార్టీ కోసం కష్టపడ్డ తమకు టికెట్ ఇవ్వకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నిస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ టికెట్ తనకే వస్తుందని చివరి వరకూ ఆశపడ్డ పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. హైదరాబాద్ లో ఒక్క జూబ్లిహిల్స్ లో మాత్రమే కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఇటీవలి సర్వేలో తేలిందని, ఇప్పుడు ఆ సీటు కూడా కాంగ్రెస్ కోల్పోతోందని చెప్పారు.

నియోజకవర్గంలో కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి ఎంతో కష్టపడ్డానని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. అలాంటిది తనకు టికెట్ ఇవ్వకుండా అజారుద్దీన్ కు కేటాయించడాన్ని ఆయన తప్పుబట్టారు. కొన్నిచోట్ల హాఫ్ టికెట్ గాళ్లకు కూడా టికెట్ ఇచ్చారంటూ పార్టీ అధిష్ఠానంపై మండిపడ్డారు. ఈవీఎంలలో తన పేరు ఉండాల్సిందేనని, ఇండిపెండెంట్ గా అయినా బరిలోకి దిగుతానని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. అనుచరులు, అభిమానులతో చర్చించాక భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని తెలిపారు. కాగా, పీజేఆర్ కూతురుకు కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ నియోజకవర్గ టికెట్ ను కేటాయించింది.

కాంగ్రెస్ లో టికెట్స్ ఆశించి భంగపడ్డ పలువురు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైయ్యారు . ఇప్పటికే జూబ్లీహిల్స్ టికెట్స్ ఆశించిన పీజేఆర్ తనయుడు విష్ణు వర్ధన్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోవడంతో పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు …కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకొని ఉంటె దక్కే ఫలితం ఇదేనా అంటూ ఫైర్ అయ్యారు .. పార్టీకి గుడ్ బై చెప్పారు .తన భవిష్యత్ కార్యాచరణ తన అనుయాయులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు .. మునుగోడు టికెట్ ఆశించిన చల్లా కృష్ణారెడ్డి , పాల్వాయి స్రవంతి తదితరులు తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు తుర్కయంజిల్ లో సమావేశమవుతున్నట్లు తెలుస్తుంది..రాజగోపాల్ రెడ్డి పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఎన్నికల్లో పోటీచేసి తిరిగి వస్తే అతనికి టికెట్ ఇవ్వడం ఏమిటనికి వారు భగ్గుమంటున్నారు …మునుగుడు నియోజకవర్గంలో చల్లా కృష్ణారెడ్డి అనుచరులు కాంగ్రెస్ , రాజగోపాల్ రెడ్డి దిష్టి బొమ్మలను తగల బెట్టారు ..ఆదిలాబాద్ లో కూడా పలువురు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు ..పరకాల సీటు ఆశించిన ఇనగాల కు కాకుండా బీజేపీ నుంచి ఇటీవలనే చేరిన రేవూరి ప్రకాష్ రెడ్డికి కేటాయించారు …వరంగల్ వెస్ట్ సీట్ కూడా జంగా రెఘవరెడ్డి ఆశిస్తుండగా రెజేందర్ రెడ్డికి ఇచ్చారు ..ఇక ఖమ్మం జిల్లాలో సీట్లు విషయం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది..పొత్తులో భాగంగా కొత్తగేడం , వైరా సీట్లను లెఫ్టుకు కేటాయించగా , ఇల్లందు , సత్తుపల్లి , అశ్వారావుపేట పెండింగ్ లో ఉన్నాయి…

గాంధీ భవన్ వద్ద పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయుల ఆందోళన

Vishnuvardhan Reddy followers protest at Gandhi Bhavan

హైదరాబాద్ నాంపల్లిలోని గాంధీ భవన్ వద్ద మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత పి.విష్ణువర్ధన్ రెడ్డి అనుచరులు ఆందోళన చేశారు. నిన్న కాంగ్రెస్ పార్టీ 45 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నప్పటికీ ఈ స్థానం నుంచి కాంగ్రెస్ అజారుద్దీన్ పేరును ప్రకటించింది. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన అనుచరులతో భేటీ అనంతరం తన నిర్ణయం ప్రకటిస్తానని వెల్లడించారు.

ఈ క్రమంలో విష్ణు అనుచరులు గాంధీ భవన్ వద్ద నేడు ఆందోళన నిర్వహించారు. గాంధీ భవన్ లోనికి వెళ్లకుండా ప్రధాన ద్వారానికి తాళం వేసి ఉంది. దీంతో ఇటుకలతో తాళం పగులగొట్టేందుకు వారు ప్రయత్నించారు. రేవంత్ బొమ్మను పగులగొట్టారు. కాంగ్రెస్ కండువాలు దగ్ధం చేశారు. విష్ణువర్ధన్ రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో గాంధీ భవన్ వద్ద కాసేపు ఉద్రిక్తత నెలకొంది.

Related posts

గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంపై తమిళిసై కీలక నిర్ణయం

Ram Narayana

కోహ్లీ తన రికార్డును సమం చేయడం పట్ల సచిన్ స్పందన

Ram Narayana

మంత్రి పువ్వాడ ఫ్యూడలిస్టుగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత ఈటెల మండిపాటు….

Ram Narayana

Leave a Comment