Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఎన్నికల వేళ పార్టీకి భారీ షాక్ …టీడీపీకి కాసాని గుడ్ బై…

అలాంటప్పుడు నేను ఎందుకు?: తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా

  • అసెంబ్లీ బరిలో తెలంగాణ టీడీపీ ఉండాలని భావించిన కాసాని
  • అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించిన పార్టీ అధిష్ఠానం
  • త్వరలో కాసాని జ్ఞానేశ్వర్ భవిష్యత్తుపై ప్రకటన చేసే అవకాశం

తెలంగాణలో టీడీపీకి బిగ్ షాక్. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబుకు పంపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ వద్దని అధిష్ఠానం చెప్పడంతో కాసాని అసంతృప్తికి లోనయ్యారు. పోటీ చేద్దామని చెప్పినా చంద్రబాబు వద్దనడంతో ఆయన రాజీనామా చేశారు.త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని వెల్లడించారు.

తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉండాలని కాసాని భావించారు. కానీ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కాసాని తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. త్వరలో ఆయన తన భవిష్యత్తుపై ప్రకటన చేయనున్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి కేడర్ ఉంది. టీడీపీ పోటీ చేస్తే చాలా నియోజకవర్గాల్లో సత్తా చాటుతుందని కాసానితో పాటు తెలంగాణ టీడీపీ నేతలు భావిస్తున్నారు. కానీ పోటీకీ అధిష్ఠానం నో చెప్పడంతో కాసాని తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా కాసాని మాట్లాడుతూ… పార్టీ నాయకులు ఎవరైనా పోటీలో నిలబడాలని చూస్తారని, కానీ ఓ వర్గం కాంగ్రెస్ పార్టీకి జై అనే వాదన తెరపైకి తెచ్చిందన్నారు. కాంగ్రెస్‌కు మద్దతివ్వాలని ఓ వర్గం చెబుతోందని, అందులో చౌదరీలు ఉన్నారన్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఉండగా దానిని నిలబెట్టుకోకపోగా… కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తామని చెప్పడం ఏమిటన్నారు. అలాంటప్పుడు టీడీపీ ఎందుకు? అధ్యక్షుడిగా నేను ఎందుకు? అందుకే రాజీనామా చేస్తున్నానన్నారు.

అయితే కాసాని రాజీనామా అనంతరం తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడించారు .తెలంగాణాలో టీడీపీ బలంగా ఉన్నప్పటికీ కొందరు ఇక్కడ పోటీ వద్దని అంటున్నారని వారిలో చౌదరీలే అధికంగా ఉండటంతో పార్టీని కాంగ్రెస్ కు అనుకూలంగా మార్చాలనే యోచనసరైంది కాదని తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు .. దీంతో కాసాని బీఆర్ యస్ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది….

Related posts

తెలంగాణలో పోటీ వద్దన్న టీడీపీ అధిష్ఠానం… పోటీ చేయాల్సిందేనంటున్న నేతలు!

Ram Narayana

పొంగులేటి షాక్ ….ముఖ్య అనుచరుడు డాక్టర్ తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కు గుడ్ బై …

Ram Narayana

ఖమ్మం జిల్లా మంత్రులకు పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జిల భాద్యతలు

Ram Narayana

Leave a Comment