Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఎట్టకేలకు సీపీఎం తొలి జాబితా విడుదల.. పాలేరు నుంచి తమ్మినేని !

  • కాంగ్రెస్‌తో పొత్తుకు యత్నించి విఫలం
  • 14 మందితో తొలి జాబితా విడుదల
  • నేటి సాయంత్రం మరో ముగ్గురు అభ్యర్థుల ప్రకటన!
  • పాలేరు నుంచి బరిలోకి తమ్మినేని

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చివరివరకు పొత్తుకు ప్రయత్నించి విఫలమైన సీపీఎం తాజాగా తమ అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగుతున్నారు.

తమకు పట్టున్న 17 స్థానాల్లో పోటీకి దిగుతున్నట్టు ఇది వరకే ప్రకటించిన సీపీఎం 14 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. నేటి సాయంత్రం మరో మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

సీపీఎం అభ్యర్థుల జాబితా
కారం పుల్లయ్య (భద్రాచలం, ఎస్టీ), పిట్టల అర్జున్ ( అశ్వారావుపేట, ఎస్టీ), తమ్మినేని వీరభద్రం (పాలేరు), పాలడుగు భాస్కర్ (మధిర, ఎస్సీ), భూక్యా వీరభద్రం (వైరా, ఎస్టీ), ఎర్ర శ్రీకాంత్ (ఖమ్మం), మాచర్ల భారతి (సత్తుపల్లి (ఎస్సీ), జూలకంటి రంగారెడ్డి (మిర్యాలగూడ), చినవెంకులు (నకిరేకల్, ఎస్సీ), కొండమడుగు నర్సింహ (భువనగిరి), మోకు కనకారెడ్డి (జనగామ), పగడాల యాదయ్య (ఇబ్రహీంపట్నం), జే మల్లికార్జున్ (పటాన్‌చెరు), ఎం దశరథ్ (ముషీరాబాద్)

Related posts

చంద్రగ్రహణం తర్వాతి రోజు నుంచి ఆ ఇంట్లో ప్రతి రోజూ మంటలు..

Drukpadam

ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన జగన్..!

Ram Narayana

మహమ్మారి అంతానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాలి: డబ్ల్యూహెచ్ఓ 

Drukpadam

Leave a Comment