Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఓటే వజ్రాయుధం …ఆలోచించి ఓటు వేయాలి …ఖమ్మం ,కొత్తగూడెం సభలో కేసీఆర్

ఓటే వజ్రాయుధం …ఆలోచించి ఓటు వేయాలి …ఖమ్మం ,కొత్తగూడెం సభలో కేసీఆర్
తుమ్మల తుప్పలు ..పువ్వాడ పువ్వులు కావాలా తేల్చుకోవాలని పిలుపు
ఖమ్మం ను అజయ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని కితాబు
సింగరేణి ఆస్తులు కేంద్రానికి కట్టబెట్టింది కాంగ్రెస్
సీతారామ ప్రాజెక్ట్ 70 శాతం పనులు పూర్తీ అయ్యాయి..
తిరిగి అధికారంలోకి వస్తే నేనే వచ్చి ప్రారంభిస్తాను
చైతన్యమంతమైన ఖమ్మం జిల్లా ప్రజలు మంచి నిర్ణయం తీసుకోవాలని హితవు

75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్య పరిణితి ఇంకా రాలేదు… ఏ ఒక్క ప్రజాసమస్య పరిష్కరించలేదు …ఫలితంగా ప్రజలు బతుకులు బాగుపడలేదు …ప్రజల చైతన్యంతోనే ప్రభుత్వాలను మార్చగలం అందుకు వచ్చిన అవకాశాలు ఉపయోగించుకోవాలి …ఎన్నికలు అన్నాక ఎవరో ఒకరు వివిధ పార్టీలనుంచి పోటీచేయడం జరుగుతుంది…ఎవరు ఏమిటి అనేది చర్చించుకోవాలి ….మనిషి గుణం గానం చూడాలి …అభ్యర్థి గుణం గణం చూడాలి …అభ్యర్థి వెనకాల పార్టీ ఉంటుంది..ఏ ప్రభుత్వం ఏర్పడాలి ..ఎవరు గెలవాలి …అనేది నిర్ణయించుకోవాలి .. ఓటు వజ్రాయుధం దాన్ని సరిగా ఉపయోగించాలి లేక పొతే గోసపడటం ఖాయమని సీఎం కేసీఆర్ హెచ్చరించారు …ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం స్థానికి ఎస్ ఆర్ అండ్ బి జి ఎన్ ఆర్ ప్రభుత్వ కళాశాల మైదానంలో జరిగిన భారీ బహిరంగసభలో పాల్గొని ప్రసంగించారు …

ఇదే జిల్లాకు చెందిన కవి రావెళ్ల వెంటరామారావు తెలంగాణ కోసం రాసిన పాటను గుర్తు చేశారు ..గతంలో గొల్లపాడు ఛానల్ ఎట్లా ఉండే ..కంపు …లకారం చెరువు వికారంగా ఉండే నేడు ఎట్లా ఉంది..వైకుంఠ ధామాలు , వెజ్ మార్కెట్లు …ఒకప్పుడు ఖమ్మం ఇరుకు సందులు …నేడు మంచి ఎడల్పు రోడ్లు ,లైట్స్,డివైడర్లు …వాడవాడలా పువ్వాడ ,సైకిల్ పై తిరిగే వాడు ..కష్టపడ్డడు .. ఇదంతా ఊరికే జరగేలేదు ఐదు సంవత్సరాల శ్రమ 4 వందల కిలో మీటర్ల నుంచి 1500 కి .మీ రోడ్లుగా మార్చారు , ఖమ్మం సుందరంగా కనపడుతుంది…ధంసలాపురం బ్రిడ్జి తీసుకొచ్చారు .. పాత బ్రిడ్జి స్థానే కొత్తగా తీగల బ్రిడ్జి కావాలని పట్టు పట్టారు ..అందుకు నిధులు కూడా ఇచ్చాం .. తుమ్మల తుప్పలు కావాలా ..?పువ్వడా పువ్వులు కావాలా ..?? కేసీఆర్ ప్రశ్న తుమ్మల తుప్పలు మీకు ముళ్ళు కుచ్చుకుంటాయి జాగ్రత్త ..మీకు తుమ్మల కావాలా అభివృద్ధి చేసే అజయ్ కావాలా ..? తుమ్మల అంటే తుప్పలు ..అజయ్ అంటే పువ్వులు అంటూ సీఎం కేసీఆర్ సెటైర్లు వేశారు . అజయ్ కు మెడికల్ కాలేజ్ ఉన్నది అయినా ప్రభుత్వ మెడికల్ కళాశాల కావాలని పట్టుపట్టి తీసుకోని వచ్చారు ….హైటెక్ బస్సు స్టాండ్ …75 వేల మంచినీటి కుళాయిలు , ఐటీ హబ్ , నిత్యం ప్రజలకోసం పరితపించే మంచి ఎమ్మెల్యేగా పువ్వాడ అజయ్ మంచి ఎంపీగా నామ నాగేశ్వరరావు మీకు ఉన్నారు . ..రఘునాథపాలెం లో ఇప్పుడు మట్టి రోడ్లు లేవు ….ప్రభుత్వానికి ఉన్న విజన్ అజయ్ మిషన్ కలిస్తే ఇవి అన్ని సాధ్యం అయ్యాయి.. ఖమ్మం అమోఘంగా అభివృద్ధి చెందింది ఇది కళ్ళ ముందు ఉన్న నగ్నసత్యం..అజయ్ ని మళ్ళీ గెలిపించండి మీకు మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు . చాల గొప్పవాడు ఒకాయన ..నేను మంత్రి పదవి ఇస్తే… నాకే ఆయన మంత్రి పదవి ఇచ్చానని అంటున్నారు .ఇక్కడ కర్ణక దమనకులు ఉన్నారు కరటక దమనకులు అంటే అడగండి …వీరి పీడా వదిలించాం …ఇప్పడు జిల్లా లో బ్రహ్మాండంగా ఉంది . ఒకాయన మాటలు దురహంకారంగా ఉన్నాయి.. వారి ప్రవర్తన అరాచకంగా ఉంది….బీఆర్ యస్ పార్టీ వాళ్ళను ఒక్కళ్లను కూడా అసెంబ్లీ గేట్ తాకనివ్వనని అంటున్నారు .అర్భకుడు ఆయన ఏమైనా జిల్లాను కొన్నాడా ఏమిటి ఈ మాటలు …ఖమ్మం చాల చైతన్యమంతమైన ప్రాంతం ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ కు మంచి ఫలితాలు రాబోతున్నాయి… ప్రజలకు నేనొకటే విజ్ఞప్తి చేస్తున్న అభివృద్ధికి పట్టంకట్టండి… కారు గుర్తుకు ఓటు వేయండి బీఆర్ యస్ అభ్యర్థులు గెలిపించండి అని కేసీఆర్ పిలుపు నిచ్చారు .. పువ్వాడ అజయ్ ప్రసంగం … ఖమ్మం ప్రజల అండదండలతో కేసీఆర్ సహకారంతో ఖమ్మాన్ని 3500 కోట్లతో అభివృద్ధి చేశా …ఇంకా చేయాల్సి పనులు చాల ఉన్నాయి…అందుకు రూపాయకుడా తీసుకోలేదు …పదవిని భాద్యత చూశాను ..కేసీఆర్ ఇచ్చిన మంత్రదండంతో ఖమ్మం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేశానని అన్నారు ..కేసీఆర్ తరచూ తనను కొడుకు లాంటి వాడని అంటాడని అందుకు అనుగుణంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా నడుచుకున్నానని అన్నారు . నాకు అన్ని విధాలుగా సహకరించిన సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటానని అన్నారు….సభలో ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు , రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ,బండి పార్థసారధి రెడ్డి ఎమ్మెల్సీ తాతా మధు ,ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య , కందాల ఉపేందర్ రెడ్డి రాములు నాయక్ బీఆర్ యస్ వైరా, మధిర అభ్యర్థులు మదన్ లాల్ , లింగాల కమల్ రాజ్ ఖమ్మం మేయర్ పూనుకొల్లు నీరజ తదితరులు పాల్గొన్నారు…

అంతకు ముందు కేసీఆర్ కొత్తగూడెం బీఆర్ యస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ కొత్తగూడెం లో జరిగిన సభలో సీఎం పాల్గొన్నారు . సీతారామ పూర్తీ అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా బంగారు తునక అవుతుంది.. కేసీఆర్ సీతారాం ప్రాజక్టు పూర్తీ అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లా బంగారు తునక అవుతుందని కేసీఆర్ అన్నారు . కొత్తగూడం సభలో వనమా వెంకటేశ్వరరావు లాంటి మంచి వ్యక్తిని గెలిపించడంద్వారా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధికి బాటలు వేయాలని సీఎం కేసీఆర్ పిలుపు నిచ్చారు.ఆదివారం కొత్తగూడెం లో జరిగిన ప్రజా ఆశ్వీర్వాదసభలో ప్రసంగిస్తూ సింగరేణి ఆస్తులు కాంగ్రెస్ కేంద్రానికి కట్టబెట్టింది విమర్శించారు …అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత సింగరేణి రూపురేఖలు మార్చమని అన్నారు. దసరాకు 700 కోట్ల రూపాయలు కార్మికులకు బోనస్ ఇవ్వడం జరిగిందని అన్నారు ..పాల్వంచ , కొత్తగూడెం పట్టణాలను వనమా పట్టు బట్టి అభివృద్ధి చేశారని కొనియాడారు …తనను కలిసినప్పుడల్లా నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం ఫండ్స్ అడిగేవారని అన్నారు .

Related posts

దొరల చేతిలో బంధీ అయిన తెలంగాణకు విముక్తి కలిగించాలి …పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Ram Narayana

మెదక్‌లో ఏఐసీసీ చీఫ్ ఖర్గే పాదయాత్ర… రేపు, ఎల్లుండి కర్ణాటక నేతల ప్రచారం

Ram Narayana

కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌పై 100 మంది పౌల్ట్రీ రైతుల పోటీ

Ram Narayana

Leave a Comment