Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేసీఆర్… శివలింగం మీద తేలు లాంటి వారు: తుమ్మల

  • బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన తుమ్మల నాగేశ్వరరావు
  • ఖమ్మంలో ఆసక్తికర వ్యాఖ్యలు
  • కేసీఆర్ అనే తేలును ఓటు అనే ఆయుధంతో కొట్టాలని పిలుపు

బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం కేసీఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్… శివలింగంపై తేలు వంటి వారని అభివర్ణించారు. తేలును కొడదామంటే కింద తెలంగాణ అనే లింగం ఉంటుందని అన్నారు. అందుకే కేసీఆర్ అనే తేలును ఓటు అనే ఆయుధంతోనే కొట్టాలని పిలుపునిచ్చారు. 

తెలంగాణ కల సాకారం చేసిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని సూచించారు. అహంకారానికి, ఖమ్మం ప్రజలకు మధ్య జరుగుతున్న ఎన్నికలు ఇవి అని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నాయకత్వాన్ని బలపరిచేలా ఖమ్మంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అన్నారు. 

40 ఏళ్ల రాజకీయ జీవితంలో 11వ సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, ప్రశాంతమైన ఖమ్మం కోసం కాంగ్రెస్ పార్టీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలో తుమ్మల మిత్ర మండలి ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి తుమ్మల హాజరై ప్రసంగించారు.

ఒక సారి రెండు సార్లు మోసం చేశారు….మూడో సారి మోసం చేయడం నీ తరం కాదు..విద్యార్థుల బలి దానాలతో సాధించుకున్న తెలంగాణ నాది అన్నట్టు వ్యవహారం ఉంది…జిల్లాలో జెండా పట్టే దిక్కు లేనపుడు నన్ను పొంగులేటి నీ పిలిచిమరీ చేర్చుకున్నారు….యావత్ తెలంగాణ సమాజం అరాచక పాలన తరమి కొట్ట పోతుంద…..పాలేరు లో పొంగులేటి నీ ఖమ్మం లో నన్ను భారీ మెజార్టీ తో గెలిపించండి

Related posts

కాంగ్రెస్‌లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కోమటిరెడ్డి సంచలన ప్రకటన

Ram Narayana

2019 పార్లమెంట్ ఎన్నికల్లో తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణం …కవిత సంచలనం ఆరోపణలు

Ram Narayana

మోదీ గ్యారెంటీ అంటే గ్యారెంటీకే గ్యారెంటీ: కామారెడ్డి సభలో మోదీ

Ram Narayana

Leave a Comment