Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ప్రధాని మోదీ మేడిగడ్డకు ఎందుకు వెళ్లలేదు?: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్న

  • బీజేపీకి ఓటు వేస్తే బీఆర్ఎస్‌కు ఓటేసినట్లే అన్న రేవంత్ రెడ్డి
  • నీళ్లు, నిధులు, నియామకాలు కేసీఆర్ ఇచ్చారా? అని ప్రశ్న
  • రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికీ న్యాయం జరగలేదని వ్యాఖ్య

బీజేపీకి ఓటు వేస్తే కనుక బీఆర్ఎస్‌కు వేసినట్లేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… అదిలాబాద్‌లో నీళ్లు, నిధులు, నియామకాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఆదిలాబాద్ అభివృద్ధికి సాగునీరు ఇచ్చారా? అని నిలదీశారు. ప్రాజెక్టుల పేరుతో కేసీఆర్ లక్ష కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. దొరల తెలంగాణ కావాలా? ప్రజల తెలంగాణ కావాలా? నిర్ణయించుకోవాలన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబానికి తప్ప ఎవరికీ న్యాయం జరగలేదన్నారు. నిన్నటి ప్రధాని మోదీ సభలో కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడలేదు? అని నిలదీశారు. మేడిగడ్డకు పోలేదు కానీ ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతారని ధ్వజమెత్తారు.

కడెం, శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులను కట్టింది కాంగ్రెస్‌ కాదా? అని ప్రశ్నించారు. పార్టీలో ఆశావహులు ఎందరు ఉన్నా ఒక్కరికే టికెట్ ఇవ్వగలమని, టికెట్ రాని వారిని కాంగ్రెస్‌ కాపాడుకుంటుందని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధిహామీ కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు. సీఎం కేసీఆర్ రూ.లక్ష కోట్లు దోచుకున్నారని, చివరకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దేశాన్ని వదిలి పారిపోతారని ఆరోపించారు. మరోసారి బీఆర్ఎస్‌ను గెలిపిస్తే ఆడవారి మెడలోని తాళిని కూడా లాక్కుపోతారన్నారు. కేసీఆర్ తాను దోచుకోవడంతో పాటు పిల్ల రాక్షసులను ప్రజల్లోకి వదిలాడన్నారు. పిల్ల రాక్షసులకు బ్రహ్మ రాక్షసుడు కేసీఆర్ అన్నారు. జోగు రామన్న ఆదిలాబాద్‌ను దోచుకున్నారన్నారు.

Related posts

తెలంగాణ కోసం కేసీఆర్ ఒక్కరే కాదు.. బీజేపీ కూడా పోరాడింది: రాజ్‌నాథ్ సింగ్

Ram Narayana

మెదక్‌లో ఏఐసీసీ చీఫ్ ఖర్గే పాదయాత్ర… రేపు, ఎల్లుండి కర్ణాటక నేతల ప్రచారం

Ram Narayana

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు త్రీబుల్ ధమాఖా …భట్టి ,తుమ్మల, పొంగులేటికి కీలక పదవులు ..

Ram Narayana

Leave a Comment