Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

పొంగులేటి ఇళ్ళు ఆఫీసులు ,బంధువుల ఇళ్లపై ఏకకాలంలో 33 చోట్ల ఐటీ దాడులు ..

పొంగులేటి ఇళ్ళు ఆఫీసులు ,బంధువుల ఇళ్లపై ఏకకాలంలో 33 చోట్ల ఐటీ దాడులు ..
ఉదయం 5 .05 గంటలకు దాడులు ప్రారంభం
ఖమ్మంలోని ఆయన నివాసంలో ఉన్న పొంగులేటి
పాలేరు కాంగ్రెస్ అభ్యర్థిగా గురువారం నామినేషన్ కు ముహర్తం
ఇదే రోజు ఐటీ దాడులపై కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం
ఖమ్మంలోని పొంగులేటి ఇంటివద్ద ఉద్రిక్తత

పొంగులేటి ఊహించినట్లుగానే ఆయన ఆఫీసులు ఇళ్ళు ,బంధువుల నివాసాలపై ఐటీ దాడులు జరిగాయి…ఏకకాలంలో హైద్రాబాద్ , ఖమ్మం ,నారాయణపురం లలో జరిగిన దాడుల సందర్భంగా ఇంట్లో ఉన్న వారిని ఎవరి బయటకు వెళ్లనివ్వలేదు ..ఖమ్మంలో ఉదయం 5 .05 లకు ఒక్కసారిగా 8 వాహనాలలో వచ్చిన అధికారులు అందరివద్ద నుంచి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు . వచ్చిరావడంతోనే వారు యూ ఆర్ ఫ్రమ్ ఇన్ టాక్స్ డిపార్ట్ మెంట్ అని చెప్పారు …దానికి పొంగులేటి అధికారులతో మీరు ఎలాంటి వివరాలు కావాలన్నా సిద్ధంగా ఉన్నామని చెప్పారు . వారు అడిగిన ఫైల్స్ అందజేశారు .ఇంట్లో అన్ని రూంలు జల్లెడ పట్టారు .15 మందికి పైగా ఐటీ అధికారులు , 10 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు .ఖమ్మం బై పాస్ రోడ్ లోని రాఘవ కంస్ట్రక్షన్ , మరికొన్ని వారి బంధువుల ఇళ్లపైనా ,పాలేరు నియోజకవర్గంలోని సాయిగణేష్ నగర్ లోని పొంగులేటి క్యాంపు కార్యాలయంపై దాడులు నిర్వహించారు హైద్రాబాద్ లోని రాఘవ కాంట్రక్షన్ ,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ,ప్రసాద్ రెడ్డి ఇళ్లపై దాడులు నిర్వహించారు . ఇళ్లలోనూ కార్యాలయాలలోను డాకుమెంట్స్ స్వాధీనం చేసుకున్న ఐటీ అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు .

ఎన్నికల వేళ పొంగులేటి ఇళ్లపై దాడులు చేయడం కేవలం కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే అని పొంగులేటి అనుయాయులు , కాంగ్రెస్ పార్టీ మండిపడుతుంది…ఈరోజు వేయాల్సిన నామినేషన్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకే బీజేపీ , బీఆర్ కల్సి కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకే ఐటీ ,ఈడీ దాడులు నిర్వహిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. బుధవారం ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంటిపై పోలీస్ ,ఐటీ అధికారులు దాడులు చేసిన సంగతి తెలిసిందే …

పొంగులేటి ఇంటివద్ద ఉద్రిక్తత …

ఖమ్మంలోని పొంగులేటి నామినేషన్ కార్యక్రమం ఉండటంతో ఆ ఏర్పాట్లలో బిజీ బిజీ గా ఉన్న పొంగులేటికి తెల్లవారేసరికి ఐటీ అధికారుల ప్రత్యక్షం అవడంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైయ్యారు .. పొంగులేటి కోసం వచ్చే వాళ్ళ కూడా తెల్లవారే సరికే ఇంటి వద్దకు చేరుకున్నారు …ఇంటి లోపల దాడులు జరుగుతుండటంతో ఎవరిని లోనకు వెళ్లనివ్వలేదు ..బయట వందలమంది గుమికూడారు …పొంగులేటి ఇంటిలోపలికి వెళ్లేందుకు ఉన్న మెయిన్ గేట్ మూసి వేయడంతో అక్కడ చేరుకున్న పొంగులేటి అభిమానులు , కార్యకర్తలు గేట్ నెట్టుకొని లోనికి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు …కొందరు ఆకతాయిలు గేటు ను బలంగా కొట్టారు …అక్కడే ఉన్న కాంగ్రెస్ నేతలు మువ్వా విజయబాబు , తుళ్లూరి బ్రహ్మయ్య , మద్దినేని బేబీ స్వర్ణకుమారి , తదితరులు కార్యకర్తలను వారించారు ..పెద్ద ఎత్తున మీడియా బృందాలు అక్కడకు చేరుకున్నాయి.. కార్యకర్తలు కేసీఆర్ డౌన్ ,డౌన్ ,పొంగులేటి శీనన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినదించారు …ఐదు గంటలుగా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి….పొంగులేటి నామినేషన్ వేసేందుకు ఉదయం 10 గంటల తర్వాత ఐటీ అధికారులు పర్మిషన్ ఇచ్చారు . ఆయన నామినేషన్ వేసేందుకు ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవసి వచ్చింది …చివరకు పొంగులేటిని నామినేషన్ వేసి తిరిగి వచ్చేందుకు అనుమతి ఇవ్వడంతో ఆయన బయటకు వచ్చి మీడియా మాట్లాడారు ….

Related posts

పెద్దాయన మాటలు పట్టించుకోవాల్సిన అవసరంలేదు ..చిరంజీవి పెద్దరికం..

Drukpadam

తాడేపల్లిలో సంక్రాంతి వేడుకలు…. హాజరైన సీఎం జగన్ దంపతులు

Ram Narayana

13 కిలోల బరువు తగ్గిన మస్క్.. సీక్రెట్ ఇదేనంటూ ట్వీట్!

Drukpadam

Leave a Comment