ఢిల్లీ లో ఈటల … కాషాయ తీర్థం పుచ్చుకుంటారని ప్రచారం…
-ఇటీవల ఈటలపై భూకబ్జా ఆరోపణలు
-మంత్రివర్గం నుంచి ఉద్వాసన
-కొత్త పార్టీ పెడతారంటూ ప్రచారం
-తెలంగాణ బీజేపీ నేతలతో సంప్రదింపులు
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఉన్నారు. రేపు ఈటల బీజేపీ అగ్రనేతలను కలవనున్నారు. ఈ క్రమంలోనే కాషాయ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. బండి సంజయ్… ఈటలను పార్టీ అగ్రనేతల వద్దకు స్వయంగా తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది.
తాజా పరిణామాల నేపథ్యంలో ఈటల బీజేపీలో చేరడం దాదాపు ఖరారైనట్టేనని రాజకీయ వర్గాలంటున్నాయి. ఇటీవల భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ సొంతపార్టీ పెడతారా? లేక ఇతర పార్టీల్లో చేరతారా? అని ఇటీవలి వరకు ప్రచారం జరిగింది. అయితే తెలంగాణ బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో ఈటల సంప్రదింపులు జరిపిన నేపథ్యంలో కొద్దిమేర స్పష్టత వచ్చినట్లు ప్రచారం జరుగుతుంది .ఈటల మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు . ఆయన బీజేపీ లో చేరటం లేదని ఇంతకూ ముందే స్పష్టం చేశారు .తాను ప్రస్తుతం తటస్తంగా ఉండి హుజారాబాద్ ఎమ్మెల్యే గా రాజీనామా చేసి తిరిగి పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు . అయితే బీజేపీ లో చేరాలని బీజేపీ నేతలనుంచి వత్తిడి వస్తుంది.రాష్ట్రంలో అనేకమంది నేతలను ఈటల కలిశారు.అందులో బీజేపీ నేతలు కూడా ఉన్నారు. బీజేపీ ఆయనకు అనేక ఆఫర్లు ఇస్తుందనే ప్రచారం కూడా జరుగుతుంది. అందులో కేంద్రమంత్రి పదవి కూడా ఉండి. అనే కాకుండా రాష్ట్రంలో ముఖ్యమైన పదవి ఇవ్వడంతో పాటు ఎమ్మెల్యే కి రాజీనామా చేస్తే ఆయనకు రాజ్యసభ సీటు ఇవ్వడంతో పాటు తన భార్య జామునకు హుజురాబాద్ లో పోటీ చేస్తే అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇస్తున్నట్లు సమాచారం . అయితే ఈటల మాత్రం బీజేపీ లో చేరేందుకు ఇంతవరకు ఎలాంటి హామీ ఇవ్వలేదని విశ్వసనీయ సమాచారం .ఆయన రాజకీయాలలో ఏదైనా జరగవచ్చునని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.