Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎలక్షన్ కమిషన్ వార్తలు

తెలంగాణలో పార్టీలకు ఈసీ షాక్! సీఈఓ కీలక ఆదేశాలు

  • రాజకీయ ప్రకటనలు నిలిపివేయాలంటూ మీడియా, సోషల్ మీడియా ఛానళ్లకు లేఖ
  • నేతలు ఇష్టారీతిన నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు జారీ చేస్తున్నారన్న ఈసీ
  • మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ బ్రేక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారన్న సీఈఓ

తెలంగాణ పార్టీలకు ఈసీ షాకిచ్చింది. రాష్ట్రంలో అన్ని రకాల రాజకీయ ప్రకటనలు నిలిపివేస్తూ సీఈఓ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అన్ని ఛానళ్లు, సోషల్ మీడియా ఛానళ్లకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ లేఖ రాశారు. నాయకులు ఈసీ నిబంధనలు అతిక్రమిస్తూ ఇష్టారీతిన ప్రకటనలతో ప్రచారం చేస్తున్నట్టు ఎన్నికల అధికారులు గుర్తించినట్టు తెలిపారు. 

అసెంబ్లీ ఎన్నికల కోసం స్టేట్ లెవెల్ సర్టిఫికేషన్ కమిటీ ఆమోదించిన రాజకీయ ప్రకటనలు దుర్వినియోగం అవుతున్నాయని సీఈఓ పేర్కొన్నారు. రాజకీయ నేతలు, అభ్యర్థులు ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘిస్తున్న కారణంగా పొలిటికల్ యాడ్స్ రద్దు చేస్తున్నట్టు సీఈఓ తన లేఖలో పేర్కొన్నారు. తక్షణమే పొలిటికల్ ప్రకటనలు నిలిపివేయాలని ఛానళ్లకు సూచించారు.

Related posts

ఏపీలో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్: సీఈవో

Ram Narayana

మహారాష్ట్ర ఎన్నికలు.. 288 స్థానాలకు 8 వేల మంది నామినేషన్లు…

Ram Narayana

ఛత్తీస్ గఢ్ లో ముగిసిన తుది విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

Ram Narayana

Leave a Comment