Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

వేములవాడ టిక్కెట్… తుల ఉమ ఇంటికి వరుస కడుతున్న నేతలు

  • తుల ఉమ ఇంటికి ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్, కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్
  • తుల ఉమ గొప్ప తెలంగాణ ఉద్యమ నాయకురాలు అన్న విష్ణునాథ్ 
  • రాజకీయ ప్రయోజనాల కోసం రాలేదని… సానుభూతి తెలిపేందుకు వచ్చామన్న కాంగ్రెస్ నేత

వేములవాడ అసెంబ్లీ టిక్కెట్‌ను తుల ఉమకు ప్రకటించిన బీజేపీ, ఆ తర్వాత ఆమెకు బీ-ఫామ్ ఇవ్వలేదు. ఆఖరి క్షణాల్లో వికాస్ రావుకు బీ-ఫామ్ ఇచ్చింది. దీంతో తుల ఉమ కన్నీరుమున్నీరయ్యారు. తనకు బీజేపీలో అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తుల ఉమ ఇంటికి వివిధ పార్టీలకు చెందిన నేతలు వరుస కడుతున్నారు. తమ పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్, కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ ఆహ్వానం పలికారు. బీఆర్ఎస్ నేతలు కూడా తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.

తుల ఉమను కలిసిన అనంతరం విష్ణునాథ్ మాట్లాడుతూ… ఆమె గొప్ప తెలంగాణ ఉద్యమ నాయకురాలు అన్నారు. బీజేపీ ఆమెను మోసం చేసిందన్నారు. తుల ఉమ ప్రజల కోసం పోరాడారని, సామాన్యులకు అండగా నిలబడ్డారన్నారు. తాము రాజకీయ ప్రయోజనాల కోసం రాలేదని, ఆమెను కలిసి సానుభూతి తెలిపేందుకు మాత్రమే వచ్చామన్నారు. తుల ఉమ సీనియర్ లీడర్ అని, మంచి పేరుందని, తెలంగాణ ఉద్యమంలో పని చేశారన్నారు. ఆమె ఎప్పుడూ ప్రజల్లో ఉన్న నాయకురాలు అన్నారు. అలాంటి మహిళకు బీ-ఫామ్ ఇవ్వకుండా మోసం చేశారన్నారు.

Related posts

తెలంగాణ ప్రగతిభవన్ ఇకనుంచి జ్యోతిరావు పూలె ప్రజాభవన్…

Ram Narayana

తుమ్మల, పొంగులేటి ఇళ్లలో ఐటీ సోదాలు… స్పందించిన రేవంత్ రెడ్డి

Ram Narayana

ప్రధాని మోడీ , అదానీ అనుభందంపై హైద్రాబాద్ లో కాంగ్రెస్ భారీ ర్యాలీ!

Ram Narayana

Leave a Comment