Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
కోవిడ్ వార్తలు

కృష్ణపట్నంలో ఇద్దరికి పాజిటివ్.. మరో 27 మందిలో స్వల్ప లక్షణాలు….

కృష్ణపట్నంలో ఇద్దరికి పాజిటివ్.. మరో 27 మందిలో స్వల్ప లక్షణాలు…
ముగ్గురికి పరీక్షలు చేస్తే ఇద్దరికి పాజిటివ్
లక్షణాలున్న 27 మంది నమూనాలను ఆర్టీపీసీర్ పరీక్షకు పంపిన అధికారులు
మరో రెండు రోజులపాటు పరీక్షలు నిర్వహించనున్న అధికారులు
ఇప్పటి వరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాని నెల్లూరు జిల్లా కృష్ణపట్నం లో రెండు పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమైయ్యారు .నాటు మందు వైద్యుడు ఆనందయ్య ఇక్కడే కరోనా కు నాటు మందు పంపిణి చేస్తూ వార్తలలో నిలిచాడు . ఆయన మందు తాత్కాలికంగా నిలిచిపోవడం గ్రామంలో కేసులు రావడం తో మరిన్ని పరీక్షలు చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది
పరీక్షలలో మరో 27 మందిలో స్వల్ప లక్షణాలు బయటపడ్డాయి. వైద్యాధికారులు నిన్న కృష్ణపట్నంలో అత్యవసరంగా ముగ్గురికి ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు నిర్వహించారు. ఫలితాల్లో ఇద్దరికి వైరస్ సంక్రమించినట్టు నిర్ధారణ అయింది. అలాగే, మరో 27 మంది స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్టు వైద్యాధికారిణి ప్రవల్లిక తెలిపారు.

స్వల్ప లక్షణాలున్న వారి నమూనాలను ఆర్టీపీసీఆర్ టెస్టుల కోసం జిల్లా కేంద్రానికి పంపినట్టు వివరించారు. గ్రామంలో కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో మరో రెండు రోజులపాటు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

Related posts

భారత్​ లో కరోనా సెకండ్​ వేవ్ పతాక స్థాయిని దాటింది .​.. కేంబ్రిడ్జి అధ్యయనంలో వెల్లడి

Drukpadam

కరోనా బారిన కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్.. ఆరోగ్యం విషమం..

Drukpadam

కరోనా వ్యాక్సినేషన్ నూతన మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం…

Drukpadam

Leave a Comment