Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

 ధరలు, ద్రవ్యోల్భణం, నిరుద్యోగం.. అన్నీ తెలంగాణలోనే ఎక్కువ: చిదంబరం విమర్శలు

  • కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ వచ్చిందన్న చిదంబరం
  • గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉందన్న కాంగ్రెస్ నేత
  • కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్ర అప్పు భారీగా పెరిగిందని విమర్శలు

కాంగ్రెస్ పార్టీ వల్లే తెలంగాణ వచ్చిందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం అన్నారు. గురువారం నాంపల్లి గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చెబుతూ… గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉందన్నారు. తెలంగాణలో అర్బన్ నిరుద్యోగిత రేటు దేశ సగటు కంటే ఎక్కువగా ఉందన్నారు. ఖాళీగా ఉన్న 80వేల ఉద్యోగాలను బీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేయలేదన్నారు. నిరుద్యోగం, అధిక ధరలను నియంత్రించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందన్నారు. నిరుద్యోగ భృతి హామీని అమలు చేయలేదన్నారు. నిరుద్యోగ రేటు మహిళల్లో 9.5 శాతం, పురుషుల్లో 7.8 శాతంగా ఉందన్నారు.

కేసీఆర్ హయాంలో తెలంగాణ రాష్ట్ర అప్పు భారీగా పెరిగిందన్నారు. ప్రతి తెలంగాణ పౌరుడిపై సగటున రూ.1 లక్ష అప్పు ఉందన్నారు. కేసీఆర్ విద్యా రంగానికి కేటాయిస్తున్న నిధులు దేశ సగటు కంటే తక్కువ అన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్సే అన్నారు. హైదరాబాద్ అభివృద్ధి కాంగ్రెస్ ఘనతే అన్నారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నార్నారు. నిత్యావసర ధరలు పెరిగాయన్నారు. పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు కూడా ఎక్కువే అన్నారు. తెలంగాణ వ్యాట్ ఎక్కువగా వసూలు చేస్తోందన్నారు. రాష్ట్ర అప్పులు రూ.3.66 లక్షల కోట్లకు పెరిగాయన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడిందో కేసీఆర్ కు అవగాహన లేదు: చిదంబరం

  • తెలంగాణ పరిస్థితిని చూసి అసంతృప్తి కలిగిందన్న చిదంబరం
  • నిరుద్యోగులను కేసీఆర్ మోసం చేశారని విమర్శ
  • రాష్ట్ర విభజన సమయంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు గుర్తున్నాయని వ్యాఖ్య
KCR has no idea on Andhra Pradesh formation says Chidambaram

తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని ఆ పార్టీ సీనియర్ నేత కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర పరిస్థితిని చూసి తనకు చాలా అసంతృప్తి కలిగిందని చెప్పారు. రాష్ట్రంలో ధరలు, నిరుద్యోగం విపరీతంగా పెరిగాయని అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గత ఎన్నికల సమయంలో చెప్పి ఆ తర్వాత మోసం చేశారని విమర్శించారు. 

కేసీఆర్ కి చరిత్రపై సరైన అవగాహన లేదని… ఆంధ్రప్రదేశ్ ఎలా ఏర్పడిందో సరిగా తెలుసుకోలేదని చిదంబరం ఎద్దేవా చేశారు. భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో కేసీఆర్ ఏం మాట్లాడారో తనకు గుర్తుందని తెలిపారు. కేంద్రంలో చక్రం తిప్పుతానని కేసీఆర్ అంటున్నారని… తనకు వచ్చే సీట్లతో ఆయన కేంద్రంలో చక్రం ఎలా తిప్పుతారని ఎద్దేవా చేశారు.

మేం అమాయకులమా?: చిదంబరం వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన మంత్రి హరీశ్ రావు

  • తెలంగాణ ప్రకటన చేసి వెనక్కి తీసుకున్నదే చిదంబరమని తీవ్ర ఆగ్రహం
  • పొట్టి శ్రీరాములు త్యాగం గురించి మాట్లాడటం దొంగే దొంగ అన్నట్లుగా ఉందని వ్యాఖ్య
  • మద్రాస్ రాష్ట్రం ఉండేదని… తెలంగాణ రాష్ట్రం లేదని చిదంబరం చెప్పడం హాస్యాస్పదమన్న హరీశ్ రావు
Minister Harish Rao comments on chidambaram

కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలపై మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. చిదంబరం తీరు హంతకుడే సంతాపం తెలిపినట్లుగా ఉందన్నారు. నాడు తెలంగాణ ప్రకటన చేసిన చిదంబరం.. దానిని వెనక్కి తీసుకున్న ఫలితంగా కదా ఉద్యమంలో యువకులు బలిదానం జరిగిందన్నారు. పొట్టి శ్రీరాములు గారి ప్రాణత్యాగం గురించి  చిదంబరం మాట్లాడటం దొంగే దొంగ అన్నట్టుగా ఉందన్నారు. పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్రం గురించి ఉద్యమించినపుడు కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అప్పటి నెహ్రు ప్రభుత్వం తాత్సారం చేయడం వల్లే కదా పొట్టి శ్రీరాములు చనిపోయింది? చరిత్ర తెలియనిది కేసీఆర్‌కు కాదు.. చిదంబరమే చరిత్ర తెలియకుండా వ‌క్ర భాష్యాలు చెబుతున్నారని దుయ్యబట్టారు.

అప్ప‌ట్లో మద్రాసు రాష్ట్రం ఉండేద‌ని, తెలంగాణ రాష్ట్రం లేదని చిదంబరం మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. హైదరాబాద్ అనేది ఓ రాష్ట్రంగా ఉండేద‌నే  విషయాన్ని ఆయ‌న మరిచిపోతున్నారన్నారు. తెలంగాణ అప్పులు, ఆదాయంపై చిదంబరం దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ ఆర్థిక క్రమశిక్షణ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కన్నా ఎంతో  బాగుందని గ్రహిస్తే మంచిదన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆర్బీఐ నివేదికలు ఏం చెబుతున్నాయో చిదంబరం తెలుసుకుంటే మంచిదన్నారు. చిదంబరం ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కారన్నారు.

కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం కాదు… పదకొండుసార్లు అవకాశమిచ్చారని గుర్తు చేశారు. చిదంబరంకు దమ్ముంటే తన సొంత రాష్ట్రం తమిళనాడులో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చే ప్రయత్నం చేయాలన్నారు. తెలంగాణ సాధించింది కేసీఆర్ అన్నారు. సాధించిన తెలంగాణను అభివృద్ది చేసి దేశానికే రోల్ మెడల్‌గా నిలిపింది కేసీఆరే అన్నారు. ఎవరు ఎన్ని ట్రిక్కులు చేసినా, ఎంతమంది వచ్చి దుష్ప్రచారం చేసినా.. యావత్ తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని ప్రజలు దీవించబోతున్నారన్నారు.

Related posts

ఆ గిన్నెలను కూడా నాకి నాకి సర్ఫ్ అవసరం లేకుండా చేశారు: బీఆర్ఎస్ నాయకులపై జగ్గారెడ్డి

Ram Narayana

ఓటు కిస్మత్‌ను మారుస్తుంది.. తేడా వస్తే జీవితాలు కిందామీద అవుతాయి: కేసీఆర్

Ram Narayana

గజ్వేల్‌లో పోటీ చేస్తానని ఈటల ప్రకటించడంతో కేసీఆర్‌కు దడ పుట్టింది: ధర్మపురి అర్వింద్

Ram Narayana

Leave a Comment