Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వరంగల్ సెంట్రల్ జైల్ స్థానంలో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి…

వరంగల్ సెంట్రల్ జైల్ స్థానంలో మల్టీసూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి…
-మామునూరు లో సెంట్రల్ జైలు
-7 మెడికల్ కాలేజీ లకు పచ్చజెండా
-రిజిస్ట్రేషన్లకు ఓకే
వరంగల్ సెంట్రల్ జైలు ను అక్కడ నుంచి తరలించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం జైలు ఉన్న స్థలంలో ప్రభుత్వ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని రాష్ట్ర కాబినెట్ నిర్ణయించింది. వరంగల్ లో ఉన్న సెంట్రల్ జైలును అక్కడ నుంచి ఖమ్మం రోడ్ లో ఉన్న మామునూర్ కు తరలించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది . ఇటీవల కొద్దీ రోజుల క్రితం వరంగల్ పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సెంట్రల్ జైలు , ఎం జి ఎం ను సందర్శించారు . అప్పుడే ఆయన ఒక నిర్ణయానికి వచ్చారు. వరంగల్ సెంట్రల్ జైలు లో ఉన్న ఖైదీలను చర్లపల్లి, నిజామాబాద్, ఖమ్మం జైళ్లకు తరలించాలని జైళ్లశాఖకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఖైదీలను ఇతర ప్రాంతాలకు తరలింపుపై విమర్శలు కూడా ఉన్నాయి . దీనిపై వేగంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్ కుమార్ ను ప్రభుత్వం ఆదేశించింది .
విధానపరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో తన మార్క్ చూపిస్తున్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా కాబినెట్ లో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కాబినెట్ సమావేశంలో రిజిస్ట్రేషన్ లను తిరిగి ప్రారంభించాలని ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో 7 మెడికల్ కాలేజీ ల ఏర్పాటుకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది . కరోనా పరిస్థితులపై చర్చించిన కాబినెట్ మరో 10 రోజులు లాక్ డౌన్ పొడగించటంతోపాటు , కర్ఫ్యూ సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పొడిగించింది . అనంతరం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసింది.

Related posts

పిండిప్రోలు సర్పంచ్ కామ్రేడ్ రాయల నాగేశ్వరరావు కన్నుమూత!

Drukpadam

మయన్మార్‌లో సైన్యం కాల్పుల్లో ఒక్కరోజే 91 మంది మృతి

Drukpadam

హుజూరాబాద్‌ పోలింగ్‌లో ఉద్రిక్త‌త‌.. స్వల్ప ఘర్షణలు…

Drukpadam

Leave a Comment