ఖమ్మంలో రసవత్తర రాజకీయం …తుమ్మల పువ్వాడ సై అంటే సై.. ఇంతకీ గెలుపెవరిది ..?
పేలుతున్న మాటల తూటాలు …తగ్గేదే లే అంటున్న వీరివురి నేతలు
9 మంది కార్పొరేటర్లు, ఎంపీపీ కాంగ్రెస్ లో చేరికతో జోష్ మీద ఉన్న తుమ్మల
ఎవరు పోయిన ప్రజలు నావెంటే అంటున్న పువ్వాడ
వ్యూహ ప్రతివ్యూహాలతో వేడెక్కుతున్న ఖమ్మం రాజకీయం
సామాజికవర్గాలుగా సమీకరణాలు ….
పోలింగ్ కు మరి కొద్దిరోజులు మిగిలింది…ఈనెల 30 న జరగనున్న ఎన్నికల కోసం అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు …ప్రధానంగా జిల్లా కేంద్రమైన ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో బిగ్ ఫైట్ నడుస్తుండటంతో రణరంగంగా మారింది…. ఒకరంగా చెప్పాలంటే కురుక్షేత్రాన్ని తలపిస్తుంది..మాటలు తూటాలై పేలుతున్నాయి… మాటల్లో ఎవరిదీ పైచేయి అనే చర్చ జరుగుతుంది…నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటనేనే స్థాయికి చేరింది వ్యహారం ….ఇంతకీ గెలుపెవరిది పువ్వాడ అజయ్ దా..? లేక తుమ్మల నాగేశ్వరరావుదా అంటే చెప్పలేని పరిస్థితి …ఎవరికీ వారే గెలుపు దీమాపై ఉన్నారు ..
ఖమ్మం అభివృద్ధి పై సవాళ్లు ప్రతిసవాళ్లు తో ప్రచారం రక్తికట్టిస్తుంది.. ఖమ్మం బస్సు స్టాండ్ నుంచి కార్పొరేషన్ కార్యాలయం వరకు ఎవరికి వారు తమ ఖాతాలో వేసుకుంటున్నారు …ఖమ్మం నూతన కలక్టరేట్ సముదాయం , ఐటీ హబ్ , రోడ్లు , సెంట్రల్ లైటింగ్ , డివైడర్లు ,లకారం లేక్ లాంటి వాటిపై ప్రధానంగా ఇద్దరు నేతలు ఫోకస్ పెట్టి ప్రచారం చేస్తున్నారు …నేను మంజూరి చేయించిన వాటికీ రంగులు వేయించి మంత్రి పువ్వాడ అజయ్ తనవిగా చెపుతున్నారన్న తుమ్మల …ఖమ్మం అభివృద్ధిలో తుమ్మల పాత్ర సూన్యమని పువ్వాడ ధ్వజం …
తుమ్మల వర్సెస్ పువ్వాడ ఎవరు గెలుస్తారనే అంశం ఏ నలుగురు ఒకచోట చేరిన చర్చనీయంశంగా మారింది… ఇద్దరు ఇద్దరే కావడం ఒకే సామాజికవర్గం ..మాజీ ,తాజాల మధ్య జరుగుతున్న పోరు ఆసక్తిని రేకెత్తిస్తుంది… ఇప్పటీకే పువ్వాడ అనేక సార్లు నియోజకవర్గాన్ని చుట్టిరాగా తుమ్మల కూడా తన అభ్యర్థిత్వం ఖరారు అయినదగ్గర నుంచి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ..
కాంగ్రెస్ అభ్యర్థిగా తుమ్మల పేరు రాక ముందు వరకు పువ్వాడ గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్నారు . అసలు పువ్వాడ మీద పోటీచేసేందుకు ఎవరు దైర్యం చేయడంలేదని ప్రచారం సైతం జరిగింది…పొంగులేటి ,తుమ్మల ఎవరొచ్చినా గట్టిపోటీ ఉంటుందని రాజకీయ పరిశీలకు అభిప్రాయపడ్డారు …అందుకు తగ్గట్లుగానే మాజీమంత్రి తుమ్మలను ఖమ్మానికి కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది…దీంతో సమీకరణాలు మారాయి…తుమ్మల ,పువ్వాడ ఒకే సామజికవర్గానికి చెందిన వారు కావడం ,ఆసామాజికవర్గంలో తుమ్మలకు గట్టి పట్టు ఉంటుందని ప్రచారం జరగడంతో పువ్వాడ కూడ అందులో ఉన్న వారిని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నంలో పడ్డారు …ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 3 లక్షల 15 ఓట్లు ఉన్నాయి..బలమైన ఓటింగ్ కమ్మసామాజికవర్గానిదే కావడం గమనార్హం….దీంతో వారే నిర్ణయాత్మక శక్తిగా ఉంటారనే దిశగా ఆలోచనలు నడుస్తున్నాయి…తర్వాత ముస్లిం మైనార్టీలు ఓటింగ్ బలంగా ఉంటుంది …. వారిలో పువ్వాడకు మంచి పట్టు ఉంది..అయితే ఇటీవల కాలంలో అనేకమంది ముస్లింలు తుమ్మలకు దగ్గరైయ్యారు …ఖమ్మం నగర కార్పొరేషన్ లో డిప్యూటీ మేయర్ గా ఉన్న ఫాతిమా బేగం మొత్తం ఇప్పటివరకు 9 మంది బీఆర్ యస్ కార్పొరేటర్లు తుమ్మల సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు …మొదటి రోజునే ముగ్గురు కార్పొరేటర్లు చేరగా తరవాత అసంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తుంది…మరికొంతమంది కార్పొరేటర్లు చేరతారని తమకు టచ్ లో ఉన్నారని తుమ్మల శిభిరం చెపుతుంది…ఇక వైశ్యులు ,బలమైన సామాజికవర్గంగా ఉన్నారు …తర్వాత బీసీల్లో మున్నూరు కాపులు ,పద్మశాలీలు , ముదిరాజులు, గౌడ సామజిక వర్గం వారు ఉండగా ఎస్సీ లు , ఎస్టీల ఓటింగ్ గణనీయంగా ఉంది … సామాజికవర్గాల వారీగా ఎవరికీ ఓట్లు ఎన్ని వస్తాయనే దానిపై ద్రుష్టి సారించారు … పేదలు నివసించే ప్రాంతాలను టార్గెట్ గా చేసి ఓట్లు పొందాలనే ప్రయత్నం రెండు శిబిరాలు విపరీతంగా చేస్తున్నాయి… దీనిలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి మరి ….!