Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

చిప్పకూడు తిన్నా సిగ్గురాలేదు… ముఖ్యమంత్రి కాలేడు: రేవంత్ రెడ్డిపై కేసీఆర్ నిప్పులు

  • రేవంత్ రెడ్డి టిక్కెట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్పారన్న కేసీఆర్రేవంత్ రెడ్డి అరాచకాలు అన్నీ ఇన్నీ కావని విమర్శలు
  • కాంగ్రెస్‌లో పదిహేనుమంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారన్న కేసీఆర్   

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం కొడంగల్‌లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి టిక్కెట్లు అమ్ముకున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలే చెప్పారన్నారు. ఆయనకు చిప్పకూడు తిన్నా సిగ్గురాలేదని విమర్శలు గుప్పించారు. ఎమ్మెల్యేలను కొనేందుకు వెళ్లి దొరికిపోయాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి అరాచకాలు అన్నీ ఇన్నీ కావని తీవ్ర విమర్శలు చేశారు.

కాంగ్రెస్ పార్టీలో పదిహేనుమంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడని చెప్పారు. రేవంత్‌కు ఓ నీతి, పద్ధతి లేవని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డికి వ్యవసాయం తెలుసా? ఎప్పుడైనా వ్యవసాయం చేశాడా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఓ భూకబ్జాదారు అని, భూములు ఎక్కడపడితే అక్కడ కబ్జాలు పెట్టాడని ఆరోపించారు.

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌దే విజయమని, ఎలాంటి అనుమానం లేదన్నారు. కొడంగల్ నుంచి గతంలో బాగా వలసలు ఉండేవని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెబుతున్నారని, ఆ స్థానంలో భూమాతను తెస్తామని చెబుతున్నారని, కానీ అది భూమేత అని దుయ్యబట్టారు.

Related posts

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫైర్ …

Ram Narayana

ఎన్నికల్లో బీజేపీ తన శక్తిమేరకు సమర్థవంతంగా పని చేసింది: కిషన్ రెడ్డి

Ram Narayana

 ధరలు, ద్రవ్యోల్భణం, నిరుద్యోగం.. అన్నీ తెలంగాణలోనే ఎక్కువ: చిదంబరం విమర్శలు

Ram Narayana

Leave a Comment