Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఈటల బీజేపీలో చేరిక విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్…

ఈటల బీజేపీలో చేరిక విషయంలో కొనసాగుతున్న సస్పెన్స్
-మా పార్టీ నేత‌లంతా ఈటలను స్వాగతిస్తున్నారన్న కిష‌న్ రెడ్డి
-ఢిల్లీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరుగులు
-ఢిల్లీలో జేపీ నడ్డాను ఈట‌ల‌ కలుస్తారంటున్న నేతలు
-బండి సంజయ్ తోనూ, నాతోనూ ఈట‌ల‌ చర్చించారన్న కిషన్ రెడ్డి
-నియంతృత్వ పాలనను ఎదుర్కోవడానికే బీజేపీని బలోపేతం చేస్తున్నాం
-పెద్దిరెడ్డి అసంతృప్తి గురించి పార్టీలో చర్చిస్తామన్న మంత్రి
-ఈ రోజు సాయంత్ర‌మే న‌డ్డాతో భేటీ ఖ‌రారు

ఈటల రాజేందర్ బీజేపీలో చేరిక విషయంలో సస్పెన్స్ ఇంకా కొనసాగుతుంది… ఢిల్లీ వెళ్లిన ఈటల బీజేపీ నేతలను కలుస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. అందుకే బండి సంజయ్ ఢిల్లీకి వెళుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాలలో ఇప్పడు ఇదొక ఆశక్తికర పరిణామంగా పరిశీలకులు భావిస్తున్నారు. ఢిల్లీ ముందుగానే చేరుకున్న ఈటల రాజేందర్ బీజేపీ నాయకులను కావలేదు . అయితే ఆయన బీజేపీ నేత వివేక్ తో కలిసి ఢిల్లీ వెళ్లారు . ఇంతకీ బీజేపీ లో ఇంత అకస్మాత్ గా చేరతారా ? ప్రస్తుతం ఆయన నియోజవర్గానికి రాజీనామా చేస్తే తప్ప ఎన్నికలు లేవు . ఈ విషయంలో టీఆర్ యస్ కూడా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఈటల భార్య జమున మీడియా ముందుకు వచ్చిన తరువాత రాష్ట్రంలో ఈటల కుటుంబంపై మరింత సానుభూతి పెరిగింది. ఆమె కేసీఆర్ కు చేసిన ఛాలంజ్ ను టీఆర్ యస్ ఏవిధంగా తిప్పికొడుతోంది అనే ఆశక్తి నెలకొన్నది .
ఈటల, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ నేత జి.వివేక్ వెంకటస్వామి నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న విష‌యం తెలిసిందే. దీనిపై కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డి స్పందిస్తూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీలో జేపీ నడ్డాను ఈట‌ల‌ కలుస్తారని స్ప‌ష్టం చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు తనతోనూ ఈట‌ల‌ చర్చించిన తర్వాతే ఢిల్లీ వెళ్లార‌ని చెప్పారు. త‌మ పార్టీలో ఈటల చేరికను త‌మ పార్టీ నేత‌లంతా స్వాగతిస్తున్నారని తెలిపారు.

ఆయ‌న చేరిక‌పై త‌మ‌ పార్టీలో సానుకూల వాతావరణం ఉందని కిష‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సీనియర్ నేత పెద్దిరెడ్డి అసంతృప్తి గురించి పార్టీలో చర్చిస్తామని చెప్పారు. పెద్దిరెడ్డి తనను విమర్శించినంత మాత్రాన తాను స్పందించాల్సి‌న అవసరం లేదని తెలిపారు. తెలంగాణ‌లో నియంత కేసీఆర్‌ను గద్దె దించటానికి అందరూ కలసి రావాలని, నియంతృత్వ పాలనను ఎదుర్కోవడానికే తెలంగాణ‌లో త‌మ‌ పార్టీని బలోపేతం చేస్తున్నామని వ్యాఖ్యానించారు.

బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ ఢిల్లీకి పరుగులు తీశారు . కాసేప‌ట్లో ఆయ‌న ఢిల్లీ చేరుకుని బీజేపీ అధిష్ఠానంతో స‌మావేశం కానున్నారు. ఈ రోజు సాయంత్రం ఈట‌ల‌, ర‌వీంద‌ర్ రెడ్డి, వివేక్‌, బండి సంజ‌య్ క‌లిసి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు.

మ‌రోవైపు, కేంద్ర‌ హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కూడా ఢిల్లీకి చేరుకుంటారని బీజేపీ నేతలు చెబుతున్నారు . జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్స‌వం ఉన్న విష‌యం తెలిసిందే. అదే రోజు ఈటల బీజేపీలో చేరే అవ‌కాశాలు ఉన్న‌ట్లు కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై ఈ రోజు రాత్రి ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం. మొత్తానికి ఈటల ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయాలని కాక పుట్టిస్తుంది .

Related posts

ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఎన్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన కరుణాకర్ రెడ్డి…

Drukpadam

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై బాలకృష్ణ స్పందన…

Drukpadam

ఎన్నికల హామీలపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ నిలదీసిన మహిళలు…

Drukpadam

Leave a Comment