Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఎన్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన కరుణాకర్ రెడ్డి…

ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఎన్ హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేసిన కరుణాకర్ రెడ్డి
-రెడ్డి సామాజికవర్గాన్ని దూషించారని ఆరోపణ
-వీడియో ఆధారాలు అందజేత
-ఫిర్యాదును స్వీకరించిన మానవ హక్కుల కమిషన్
-ప్రస్తుతం బెయిల్ పై బయటున్న రఘురామ

నరసాపురం ఎంపీ వైసిపి అసమ్మతినేత రఘురామకృషంరాజు రాజద్రోహంకేసులు సుప్రీం బెయిలుపై ఉన్నారు . ఆయనకు సుప్రీం కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే . ఆయన ప్రభుత్వంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడని షరతు ఉన్నప్పటికీ మరో దారిలో విమర్శలకు పదును పెడుతున్నారా ? అనే సందేహాలకు కలుగుతున్నాయి. ఆయన ఢిల్లీ ఎయిమ్స్ లో కళ్ళకు కట్టలు కట్టించుకొని వీల్ చైర్ తోనే తన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ సింగ్ ను కలిశారు. ఎన్ హెచ్ ఆర్ సి లో ఫిర్యాదు చేశారు. ఆయనపై కూడా ఫిరాయిదుల పరంపర కొనసాగే ఆవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్డి సంక్షేమ సంఘ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ఎన్ హెచ్ ఆర్ సి లో రఘురామ పై ఫిర్యాదు చేశారు .విచారణకు స్వీకరించిన ఎన్ హెచ్ ఆర్ సి నోటీసులు జారీచేసింది .
అంతకు ముందే రోజునే ఆయన ఫిర్యాదు చేశారు. తనను అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ దారుణమైన రీతిలో వ్యవహరించిందంటూ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్చార్సీ) కు ఎంపీ రఘురామకృష్ణరాజు నిన్న ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎన్ హెచ్చార్సీ చైర్మన్ పీసీ పంత్ ను కలిసిన రఘురామ తన అరెస్ట్ నుంచి జరిగిన పరిణామాలను వివరించారు. అయితే, ఆయన ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఆయనపై ఎన్ హెచ్చార్సీలో ఫిర్యాదు దాఖలైంది.

రఘురామకృష్ణరాజు ఇటీవల రెడ్డి సామాజిక వర్గాన్ని అవమానించేలా వ్యాఖ్యలు చేశారంటూ ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రఘురామ వ్యాఖ్యల తాలూకు వీడియోలను కూడా కరుణాకర్ రెడ్డి మానవ హక్కుల కమిషన్ కు అందజేశారు. ఈ ఫిర్యాదును కమిషన్ విచారణకు స్వీకరించింది. రఘురామకృష్ణరాజు రాజద్రోహం కేసులో ప్రస్తుతం బెయిల్ పై బయటున్నారు.

Related posts

సాయి గణేష్ ప్రాణం తీసిన పాపం బిజెపి నాయకులదే.. టీఆర్ యస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ తాతా మధు!

Drukpadam

టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవం..!

Drukpadam

కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన యువకుడి అరెస్ట్!

Drukpadam

Leave a Comment