- -మహిళలను మేము ఆదుకుంటాము
- -కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన మహిళ బాధను పంచుకుంటాము
- -నా వంతుగా మీకు ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను
- -మా ఫోన్ నంబరు: 040-48213268
తెలంగాణలో కరోనా వ్యాప్తి కారణంగా.. సంపాదించే ఇంటి పెద్దను కోల్పోయి అనేక కుటుంబాలు కష్టాల్లో పడ్డాయంటూ ‘కూలుతున్న కుటుంబాలు’ పేరిట ఓ వార్తా పత్రికలో ఇచ్చిన కథనాన్ని వైఎస్ షర్మిల పోస్ట్ చేస్తూ మహిళలకు తాను సాయం చేస్తానని ప్రకటించారు.
‘తెలంగాణ ఆడబిడ్డలారా… ధైర్యం కోల్పోకండి.. కుటుంబ పెద్ద దిక్కు తండ్రి/భర్త /కొడుకును కరోనా వల్ల కోల్పోయి కుటుంబాన్ని నెట్టలేక నిరాశ, నిస్పృహలతో కృంగిపోతున్న మహిళల బాధను కాస్తైనా పంచుకోవడానికి నా వంతుగా మీకు ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నాను. మా ఫోన్ నంబరు: 040-48213268’ అని షర్మిల ట్వీట్ చేశారు.
కాగా, కరోనాతో కష్టాలు ఎదుర్కొంటోన్న కుటుంబాలకు షర్మిల అభిమానులు ఇప్పటికే సాయం చేస్తున్నారు. తాజాగా, ములుగు జిల్లా, కొత్తగూడ మండలం కుధనపెళ్లి గ్రామ నివాసి కోమండ్ల సురేశ్ రావు కరోనాతో మృతిచెందగా, వారి కుటుంబాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో సాయం చేశామని షర్మిల ట్వీట్ చేశారు. “ఆపదలో తోడుగా వైఎస్ఎస్ఆర్” టీమ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించామని చెప్పారు. వారి కుటుంబానికి ఈ సహాయం మనోధైర్యాన్ని ఇస్తుందని ఆశిస్తున్నానని షర్మిల తెలిపారు.