Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణాలో కాంగ్రెస్ గెలుపు దేశరాజకీయాలు మలుపు …మాజీమంత్రి తుమ్మల

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు దేశరాజకీయాల్లో మలుపు కావాలని మాజీమంత్రి ఖమ్మం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు …ఖమ్మంలో తన ఎన్నికల ప్రచారంలో తీరికలేకుండా ఉన్న తుమ్మల పార్టీ పిలుపు మేరకు హైద్రాబాద్ లోని శేరిలింగంపల్లి లో సోమవారం కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ విజయాన్ని కాంక్షిస్తూ జరిగిన ఎన్నికల ర్యాలీలో తుమ్మల పాల్గొని హాట్ కామెంట్స్ చేశారు …మాటిమాటికి సెటిలర్స్ ,సెటిలర్స్ అని అంటున్నారు ..సెటిలర్స్ అనే పదం తీసేయండి…హైద్రాబాద్ ఎవడబ్బ సొత్తుకాదు …అందరిదీ …ఇది మన గడ్డ ఇక్కడే జీవిస్తున్నాం …మన పిల్లలు ఇక్కడే పుట్టారు …అమెరికా లాంటి దేశంలో అక్కడ పుట్టిన బిడ్డలకు ఆదేశం వెంటనే పౌరసత్వం ఇస్తుంది…అందువల్ల మీరు ఎక్కడి వాళ్ళో కాదు ..ఇక్కడ వాళ్ళే అంటూ తన డైన శైలిలో పేర్కొన్నారు …

పూజ్యులు ఎన్టీఆర్ సంక్షేమ రాజ్యం….రామ రాజ్యం చూసాం…రామరాజ్యం అంటే ఎన్టీఆర్ రాజ్యం…ఎన్టీఆర్ ఆత్మ గౌరవ రాజకీయాలు నేర్పితే ..ఆత్మ విశ్వాస రాజకీయాలు చంద్రబాబు నేర్పారు…చంద్రబాబు నాయకత్వంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగింది …ఐ.టీ టవర్స్….. ఔటర్ రింగు రోడ్డు…శంషా.బాద్ ఎయిర్ పోర్ట్ ఇన్ ఫ్రా తో విశ్వ నగరం గా పునాది వేసిన నాయకుడు చంద్రబాబు..2020 విజన్ తో ఉమ్మడి రాష్ట్రం అభివృద్ది చేశారు…

రాజకీయం గా నష్టపోయినా తెలంగాణ ఏర్పాటు లో సోనియా గాంధీ చరిత్ర లో నిలిచారు
తెలంగాణ లో అహంకారం దోపిడీ మాఫీయా కబ్జా రాజ్యం గా మారింది…ప్రజా ప్రతినిధులు మాఫీయా గా మారారు…పోలీస్ లను ఎమ్మేల్యే లకు అప్ప చెప్పారు…ప్రజా స్వామిక తెలంగాణ కోసం మార్పు కోరుతున్నారు…ఓ కుటుంబం నుంచి తెలంగాణ కు విముక్తి కోసం కాంగ్రెస్ పార్టీ నే గెలిపించాలి…ఈ ఎన్నికలు చారిత్రకమైనవి…తెలంగాణ లో కాంగ్రెస్ గెలుపు దేశ రాజకీయాల్లో మార్పుకు నాంది కావాలి…మాట తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేసిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి…జగదీశ్వర్ గౌడ్ ను గెలిపించాలని తుమ్మల పిలుపు నిచ్చారు….

Related posts

రేపు జిల్లాల పర్యటనకు కేసీఆర్… ఉదయం నుంచి రాత్రి వరకు షెడ్యూల్ ఇదే

Ram Narayana

తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు కాంగ్రెస్ ఇంఛార్జుల నియామకం

Ram Narayana

కేటీఆర్ తన ఫ్రెండ్‌కు టిక్కెట్ ఇచ్చారు, ఎలా గెలుస్తారో చూస్తా: రేఖానాయక్ కంటతడి

Ram Narayana

Leave a Comment