Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఒకేసారి 14 వైద్య కళాశాలలకు శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం జగన్ …

  • -10,111 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు..
  • -560 అర్బ‌న్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తాం
  • -మండ‌లానికి క‌నీసం 2 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాలు
  • -176 పీహెచ్‌సీల‌ను నిర్మిస్తామన్న జ‌గ‌న్

ఏపీలో 14 వైద్య కళాశాలల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ కాలేజీల‌ను ఏపీలోని పిడుగురాళ్ల, మచిలీపట్నం, విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అమలాపురం, పాలకొల్లు, ఏలూరు, బాపట్ల, మార్కాపురం, మదనపల్లె, పెనుకొండ, నంద్యాల, ఆదోనిలో నిర్మిస్తారని ఆయ‌న చెప్పారు.

రాష్ట్రంలో పేద వారికి వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని జగన్ తెలిపారు. 10,111 వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, 560 అర్బ‌న్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు. మండ‌లానికి క‌నీసం 2 ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల‌ను ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు వివ‌రించారు.

ఏపీలో మొత్తం 176 పీహెచ్‌సీల‌ను నిర్మిస్తామ‌ని తెలిపారు. గిరిజ‌నుల కోసం రూ.246 కోట్లతో 5 గిరిజ‌న ఆసుప‌త్రులను నిర్మిస్తున్న‌ట్లు జగన్ చెప్పారు. ఇప్ప‌టికే వైఎస్సార్ ఆరోగ్య‌శ్రీ ప‌రిధిలోకి 2,436 వైద్య చికిత్స‌లు తీసుకొచ్చామ‌ని వివ‌రించారు.

ప్రతి పార్లమెంట్‌ పరిధిలోనూ టీచింగ్‌ మెడికల్‌ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని జగన్ తెలిపారు. మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పులివెందుల, పాడేరులో మెడికల్ కాలేజీల పనులు జరుగుతున్నాయని వివ‌రించారు. కొత్త‌ మెడికల్‌ కాలేజీల నిర్మాణాలను మూడేళ్లలో పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించామని ముఖ్యమంత్రి తెలిపారు.

Related posts

నడుము – వెన్ను నొప్పి వేధిస్తుంటే.. ఇవి ట్రై చేయండి!

Drukpadam

సింగర్ అవతారమెత్తిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్!

Drukpadam

కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు రాష్ట్రప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది-కేటీఆర్

Drukpadam

Leave a Comment