Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

జుబ్లియంట్ మూడ్ లో భట్టి, పొంగులేటి ,తుమ్మల

జుబ్లియంట్ మూడ్ లో భట్టి, పొంగులేటి ,తుమ్మల

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోపాటు ఉమ్మడి జిల్లాలో ఘన విజయం సాధించడం తో నేతలు జుబ్లియంట్ మూడ్ లో ఉన్నారు ….భట్టి, తుమ్మల ,పొంగులేటి క్యాంపు కార్యాలయాలు , నివాసాల వద్ద వందలాది మంది అభిమానులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు .గులాలు చల్లు కున్నారు…కుటుంబసభ్యులతో ఆత్మీయులతో కలిసి సంతోష సంబరాల్లో పాల్గొన్నారు …

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రజలు నవశకానికి నాంది పలుకుతూ..మొత్తo పది సీట్లకు గాను..9 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం హర్షణీయమని కాంగ్రెస్ పాలేరు అసెంబ్లీ విజేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆనంద వ్యక్తం చేశారు. ఆదివారం జరిగిన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో 56,460 ఓట్ల భారీ మెజారిటీ తో పాలేరులో తనను గెలిపించిన ప్రజలకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్రంలో నిరంకుశ బీఆర్ఎస్ పాలకులను ఇంటికి సాగనంపి , కాంగ్రెస్ కు పట్టం కట్టడం పట్ల ఆనంద వ్యక్తం చేశారు. పాలేరు తో పాటు మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అధికారాన్ని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ రాజ్యం ద్వారా సుపరిపాలన అందించి వారి రుణం తీర్చుకుంటామని ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.

Related posts

శీనన్న ఎన్నికలప్పుడే వచ్చే టైపు కాదు…మంత్రి పొంగులేటి

Ram Narayana

మంత్రి పువ్వాడ అజయ్ వాహనంలో ఎన్నికల అధికారుల తనిఖీలు

Ram Narayana

ఖమ్మం నుంచే తుమ్మల పోటీ …!

Ram Narayana

Leave a Comment