Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారానికి వెళ్తున్నారా? అనే ప్రశ్నకు సోనియాగాంధీ సమాధానం ఇదే!

  • సీఎంగా రేపు ప్రమాణస్వీకారం చేస్తున్న రేవంత్ రెడ్డి
  • ఈ కార్యక్రమం కోసం తరలిరానున్న కాంగ్రెస్ పెద్దలు
  • హైదరాబాద్ కు వెళ్తున్నానన్న సోనియాగాంధీ

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు తరలిరానున్నారు. అయితే, స్వల్ప అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న సోనియాగాంధీ వస్తారా? లేదా? అనే విషయంలో అందరిలో కొంత సందిగ్ధత నెలకొంది. దీనికి ఆమె తెరదించారు. రేవంత్ ప్రమాణస్వీకార కార్యక్రమం కోసం మీరు రేపు హైదరాబాద్ కు వెళ్తున్నారా? అని ఒక మీడియా ప్రతినిధి ఆమెను ప్రశ్నించగా… ‘వెళ్లొచ్చు’ అని ఆమె సమాధానమిచ్చారు. దీంతో, సోనియా హైదరాబాద్ కు వస్తున్నారనే విషయంలో పూర్తి క్లారిటీ వచ్చినట్టయింది.

Related posts

ఒడిశా లోని బాలాసోర్ వద్ద జరిగిన రైలు ప్రమాదంలో 300 వరకు మృతి ..!

Drukpadam

సిమ్లా సమీపంలో ఒక్కసారిగా కుప్పకూలిన ఐదంతస్తుల భవనం… వీడియో ఇదిగో

Ram Narayana

గాల్వాన్ వ్యాలీ ఘర్షణ తర్వాత ఎల్ఏసీ వెంబడి మరో రెండుసార్లు ఘర్షణపడ్డ భారత్, చైనా బలగాలు!

Ram Narayana

Leave a Comment