Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆరోగ్యం

కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై యశోద ఆసుపత్రి వైద్యుల హెల్త్ బులెటిన్

  • వైద్యుల పర్యవేక్షణలో వాకర్‌తో నడుస్తున్నట్లు వెల్లడి
  • కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆయనను వైద్య బృందం నిత్యం పర్యవేక్షిస్తోందన్న డాక్టర్లు
  • కేసీఆర్ బెడ్ మీద నుంచి లేచి తిరుగుతున్నారన్న వైద్యులు

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెల్త్ బులెటిన్‌ను యశోద ఆసుపత్రి వైద్యులు విడుదల చేశారు. ఆయనకు నిన్న శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. ఉదయం, సాయంత్రం ఆయన హెల్త్ బులెటిన్‌ను వైద్యులు విడుదల చేస్తున్నారు. ఆయన వైద్యుల పర్యవేక్షణలో వాకర్‌తో నడుస్తున్నారు. శనివారం సాయంత్రం ఆసుపత్రి వర్గాలు రెండో రోజు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. కేసీఆర్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఆయనను వైద్య బృందం నిత్యం పర్యవేక్షిస్తోందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. బెడ్ మీద నుంచి లేచి తిరుగుతున్నారని, ఆర్థోపెడిక్, ఫిజియోథెరఫీ వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ నడుస్తున్నారన్నారు. ఆయన ఆరోగ్య పురోగతి పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. ఈ రోజంతా ఆయన విశ్రాంతి తీసుకున్నట్లు తెలిపారు.

Related posts

వర్షాకాలం రోగాలతో జర జాగ్రత్త.. ఈ 5 ఆహార శుభ్రత చిట్కాలు పాటిస్తే ఎంతో మేలు!

Ram Narayana

తెలియకుండా ఇలా చేస్తుంటే… జ్ఞాపకశక్తి తగ్గిపోతుందట!

Ram Narayana

కార్ల‌లో క్యాన్స‌ర్ కార‌క కెమిక‌ల్స్‌.. అధ్య‌య‌నంలో వెల్ల‌డ‌యిన షాకింగ్ నిజాలు!

Ram Narayana

Leave a Comment