Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

మాది న్యాయమైన పోరాటం ప్రభుత్వం కళ్లు తెరవాలి.

మాది న్యాయమైన పోరాటం ప్రభుత్వం కళ్లు తెరవాలి.

ప్రాణం పోయినా మడం తిప్పని విప్లవకారులo

వెలుగుమట్ల కాలనీ గ్రామీణ పేదల సంఘం 5 వ వార్షికోత్సవంలో వక్తలు

మాది న్యాయపోరాటం పేదలు గుడిసెలను తొలగించడం సరికాదు …మాప్రాణం పోయిన పేదల పక్షాన నిలబడతాం అని వెలుగుమట్ల కాలనీ వాసులు ప్రతిన బూనారు ….ఖమ్మం జిల్లా అర్బన్ మండల పరిధిలోని వెలుగుమట్ల (వినోభా (నవోదయ) కాలనీ) గ్రామంలో “గ్రామీణ పేదల సంఘం”నగర శాఖ ఆధ్వర్యంలో కాలనీ 5 వ వార్షికోత్సవ బహిరంగ సభ ఏర్పాటు చేశారు . దీనికి ముందుగా కాలనీ సెంటర్ లోని యూ సి సి ఆర్ ఐ ఎం ఎల్ పార్టీ జెండాను ఇళ్ల స్థలాల కమిటీ అధ్యక్షులు జంగం రామచంద్రయ్య చేతుల మీదుగా ఆవిష్కరణ జరిగింది . అనంతరం జరిగిన సభలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులు కల్తి ఎర్రబాబు అధ్యక్షత వహించారు . ఈ సభకు ఉపన్యాసకులుగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు పడిగ ఎర్రయ్య,పార్టీ రాష్ట్ర నాయకులు పి.ముత్తయ్య ,”ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ”దండా లింగయ్య కుర్మచలం రవీంద్ర స్వామి పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ 2014 ఏప్రిల్ లో భూదాన్ వారు ప్రొసీడింగ్స్ ద్వారా ఇళ్ల స్థలాలు లేనివారికి కేటాయించడం జరిగింది అని 2018 డిసెంబర్ 15 నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారని వారు తెలిపారు. జీవో నెంబర్ 58,59 ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారిని కనీసం వారి దరఖాస్తులు కూడా పరిశీలన జరగలేదని అన్నారు. ఈ స్థలాలలో నివాసం ఉంటున్న వారికి ఎటువంటి నోటీసులు కూడా అందజేయలేదని ఒకవేళ నోటీసులు అందిన పోరాటాల ద్వారానే సాధ్యమని ఇక్కడ నివసిస్తున్న ప్రజలందరూ చుట్టుపక్కల గ్రామాల నుంచి వలస వచ్చిన కూలీలు అని వారు అన్నారు . ఈ కార్యక్రమంలో భాణాల లక్ష్మణాచారి , కల్తి రామచంద్రయ్య , షేక్ సొంద్ మియా , కామ్రేడ్ కల్తి లెనిన్ నాయకులు , నవోదయ కాలనీ వాసులు , ఖమ్మం నగర ఇళ్ల స్థలాలు లేని పేదలు తరలి వచ్చారు.

Related posts

బందిపోట్ల ముఠాను తయారు చేసింది నువ్వు …మంత్రి పువ్వాడపై తుమ్మల అటాక్…

Ram Narayana

కాంగ్రెస్ అభ్యర్థి త్రిబుల్ ఆర్ కు మద్దతుగా సినీ హీరో వెంకటేష్ ఖమ్మంలో రోడ్ షో !

Ram Narayana

రాయల చంద్రశేఖర్ మృతి ప్రజాఉద్యమాలకు తీరని లోటు …పలువురు నివాళులు

Ram Narayana

Leave a Comment